సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన సర్వే వివరాలు జగన్ చేతికి అందింది..ఇప్పుడు ఆ సర్వేని బట్టి ఎమ్మెల్యేల భవితవ్యం జగన్ డిసైడ్ చేయనున్నారు. వర్క్ షాపులో ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది..ఎవరి పనితీరు బాగోలేదనే వివరాలు బయటపెట్టే ఛాన్స్ ఉంది. అలాగే పనితీరు బాగోని వారి విషయంలో జగన్ ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడిపోవడం, టీడీపీకి కాస్త పాజిటివ్ రావడం, నలుగురు ఎమ్మెల్యేలపై వేటు..ఇలా పలు అంశాలపై జగన్ మాట్లాడనున్నారు. ఇక వై నాట్ 175 అంటూ ముందుకెళుతున్న సీఎం జగన్..తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలకు స్పష్టమైన రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. గతంలో సర్వే నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరు ..మెరుగు పర్చుకోవాల్సిన అంశాల పైన చర్చించనున్నారు.
అయితే ఇప్పటికే పలుసార్లు జరిగిన వర్క్ షాపులో కొందరు ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పర్చుకోవాలని జగన్ సూచించారు. నెక్స్ట్ వర్క్ షాపుకు అందరూ పనితీరు మెరుగు పడాలని సూచించారు. ఇక ఇప్పుడు ఏ ఎమ్మెల్యే పనితీరు మెరుగు పడింది…ఎవరు వెనుకబడ్డారో..జగన్ వద్ద స్పష్టమైన సర్వే నివేదికలు ఉన్నాయి.
ఇక రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి.. టిడిపికి మళ్ళీ ఎలా చెక్ పెట్టాలనే అంశాపై మార్గనిర్దేశం చేయనున్నారు. ఇంకా పని తీరు మెరుగుపర్చుకోవాల్సిన ఎమ్మెల్యేల విషయంలో ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠను పెంచుతోంది. ఇక కొందరు ఎమ్మెల్యేల్లో సొంత పార్టీపై అసంతృప్తి ఉందనే ప్రచారం పైన జగన్ స్పందిస్తారా? వారిని ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నా సరే నియోజకవర్గాల్లో పనులు అవ్వడం లేదనే అసంతృప్తి చాలామంది ఎమ్మెల్యేల్లో ఉంది. అలా ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి బయటకొచ్చారు. అలాంటి వారు వైసీపీలో ఇంకా ఉన్నారు.వారి అసంతృప్తిని జగన్ పోగొడతారో లేదో చూడాలి.