తెలంగాణ సిఎం కేసిఆర్, ఏపీ సిఎం జగన్..ఇద్దరు సన్నిహితులే అనే సంగతి తెలిసిందే. ఇద్దరు నేతలు ఒకరినొకరు సహకరించుకుంటారు. ఇద్దరి మధ్య విభేదాలు లేవు..అలాంటప్పుడు ఇప్పుడు ఇద్దరి మధ్య రాజకీయంగా యుద్ధం మొదలైందంటే నమ్మడం కష్టమే. కాకపోతే ఆ స్థాయిలో రాజకీయం నడిపిస్తున్నారనే చెప్పవచ్చు. అది కూడా ఏపీలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాన్ విషయంపై..ఈ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రయివేటీకరణ దిశగా తీసుకెళుతుంది.
కానీ దీనికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అలాగే రాష్ట్రంలో వైసీపీ, టిడిపి, జనసేన..ఇక బిజేపి మినహా అన్నీ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు..కానీ కేంద్రంపై పోరాడలేని పరిస్తితి. ఈ సమయంలోనే కేంద్రంపై పోరాటం చేస్తున్న కేసిఆర్..బిఆర్‌ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి చూస్తున్నారు. ఏపీలో కూడా బిఆర్‌ఎస్ పార్టీ పెట్టారు. అయితే అక్కడ రాజకీయంగా స్పేస్ లేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా ఆయన ఎంట్రీకి ప్లాన్ చేశారు. ప్రయివేటీకరణని వ్యతిరేకిస్తూ బిజేపిపై విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేయడానికి యత్నిస్తుంటే… దానిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణా సీఎం కేసీఆర్ సింగరేణి తో బిడ్ వేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే… అసలు వాస్తవం వేరు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియకు, ప్రైవేటీకరణకు సంబంధం లేదు. ముడిపదార్థాల సరఫరా లేదా వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చితే… దానికి సమానమైన విలువగల స్టీల్ ఇస్తామని, ఆసక్తి ఉన్న వాళ్లు ముందుకు రండని విశాఖ స్టీల్స్ ‘ఆసక్తి వ్యక్తీకరణ’ (ఈవోఐ) ప్రకటన జారీ చేసింది. అంతే గాని.. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కాదు. కానీ అక్కడ ఏదో జరుగుతున్నట్లు సృష్టిస్తున్నారు.
ఇక కేసిఆర్ ఎంటర్ కావడంతో రాజకీయంగా తమకు ఎక్కడ ఇబ్బంది వస్తుందని చెప్పి వైసీపీ నేతలు కొత్త కథ మొదలుపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ప్రయివేటీకరణని అడ్డుకునేందుకు..ఇప్పటికే మోదీతో పలుమార్లు మాట్లాడారని అంటున్నారు. కానీ ఏం జరగలేదు. అంటే స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కేసిఆర్, ఇక దాని ద్వారా తమకు నష్టం రాకూడదని జగన్ చుతున్నారు. ఇలా వీరి మధ్య రాజకీయ పోరు మొదలైంది. చివరికి ఇది ఎటు వెళుతుందో చూడాలి.