ఎడిట్ నోట్: సైకిల్ జోరు..ఫ్యాన్ పోరు.!

-

తెలుగుదేశం పార్టీ బలం పెంచుతుంది వైసీపీనే అని చెప్పాలి. ఎక్కడో అట్టడుగుకు వెళ్ళిన పార్టీని మరి జాకీలు పెట్టి లేపింది వైసీపీనే. ఎందుకంటే గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి బయటకురాలేని పరిస్తితుల్లో ఉన్న టి‌డి‌పిని…పెద్ద ఎత్తున టార్గెట్ చేయడం, కక్ష సాధించడం, నేతలపై కేసులు పెట్టడం, చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టించడం..ఇలా చేయడం వల్ల..టి‌డి‌పికి నష్టమేమీ జరగలేదు..పైగా ప్రజల్లో సానుభూతి పెరిగింది. దీంతో టి‌డి‌పి బలం పెరిగింది.

ఇప్పుడు వైసీపీకి ధీటుగా టి‌డి‌పి ఎదిగింది. ఇంకా టి‌డి‌పి బలం పెంచడమే లక్ష్యంగా అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ముందుకెళుతున్నారు. ఓ వైపు లోకేష్ పాదయాత్ర చేస్తూ ప్రజా మద్ధతు కూడబెడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు బాబు రోడ్ షోలు, సభలతో ఇంకా పార్టీ బలం పెంచుతున్నారు. ఈ తరుణంలో ఇద్దరు నేతల పర్యటనలని అడ్డుకోవాలని చెప్పి..వైసీపీ ప్రయత్నిస్తుంది. దీని వల్ల టి‌డి‌పికి పోయిదేమీ లేదు గాని వైసీపీకే నష్టం జరుగుతుంది. అసలు బాబు, లోకేష్ అనని మాటలని అనట్లు క్రియేట్ చేసి..వైసీపీ నిరసనల పేరుతో హడావిడి చేస్తుందని టి‌డి‌పి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

ఈ మధ్య లోకేష్..జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ..అసలు జగన్..దళితులకు పీకింది ఏమి లేదని అన్నారు..అంటే దళితులకు జగన్ ఏం చేయలేదనే అర్ధంతో మాట్లాడారు. కానీ వైసీపీ, వైసీపీ మీడియా మాత్రం…దళితులు ఏం పీకింది లేదని అన్నారని ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఆదోనిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ని అడ్డుకోవాలని వైసీపీ చూసింది. కానీ అక్కడ టి‌డి‌పి శ్రేణులు ప్రతిఘటించాయి. అలాగే దళితులని తాను అవమానించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అలా కానీ పక్షంలో సాక్షిని భారతి రెడ్డి మూసేయ్యాలని ఛాలెంజ్ చేశారు. దీంతో వైసీపీ నిరసన పోరు విఫలమైంది.

ఇక ఎప్పుడో బాబు..దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని అన్నారని, దానికి క్షమాపణ చెప్పాలని యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్..బాబు పర్యటనలో నిరసన తెలియజేశారు. చొక్కా విప్పి మరీ ఆందోళన చేశారు. అయితే బాబు అన్న మాటలు వేరు..వైసీపీ చెబుతుంది వేరు..అయినా బాబు పర్యటనలకు జనం భారీగా వస్తున్నారని, అందుకే అడ్డుకోవడానికి వైసీపీ ప్లాన్ చేసిందని, అయినా సరే అది విఫలమైందని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. అంటే ప్రజల్లో టి‌డి‌పి  మద్ధతు పెరుగుతుంటే..దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తూ విఫలమవుతుందని అంటున్నారు. మొత్తానికి పరిస్తితి చూస్తే అలాగే కనిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news