ముగిసిన విదేశీ పర్యటన…..ఇండియా కు బయలుదేరిన ప్రధాని మోదీ

-

రెండు దేశాల పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా యూఏఈ, ఖతర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా దోహా నుంచి ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. భారత్-ఖతర్ మధ్య ముఖ్యమైన అధ్యాయం ముగిసిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

 

అబుదాబిలో నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయము బుధవారం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం అయింది.యూఏఈలో ఇదే తొలి హిందూ దేవాలయం కావడం విశేషం.దుబాయ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌, ప్రధాని నరేంద్ర మోడీ ‘భారత్‌ మార్ట్‌’కు శంకుస్థాపన చేశారు.ఎగుమతులను ప్రోత్సహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది భారత సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగం అంతర్జాతీయ కొనుగోలుదారులను చేరుకోవడానికి సహాయపడుతుంది. భారత్ మార్ట్ 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా.

Read more RELATED
Recommended to you

Exit mobile version