ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈటల రాజేందర్..తాజాగా మరో సంచలన అంశం బయటపెట్టారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ తో పాటు తమ పార్టీలోనూ కోవర్టులు ఉన్నారని బాంబ్ పేల్చారు. అదే సమయంలో తాజాగా తెలంగాణ బిజేపి నాయకత్వంపై వివాదాస్పద ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన జితేందర్ రెడ్డి గురించి కూడా ఈటల కామెంట్ చేశారు.
ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశారో జితేందర్ రెడ్డికే తెలియాలని, కానీ సీనియర్ నాయకులు ప్రతి అంశంలో ఆచి తూచి అడుగులేయాలని అన్నారు. ఇక పార్టీ మార్పుపై కూడా ఈటల స్పందించారు. తాను బీజేపీని వీడుతున్నదనేది అవాస్తవం అనేది..షర్ట్ మర్చినట్లు పార్టీ మార్చలేమని ఆయన చెప్పుకొచ్చారు. ఇక కేసిఆర్‌కు కాంగ్రెస్ తో పాటు బిజేపిలో కూడా కోవర్టులు ఉన్నారని చెప్పడం సంచలనంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ లో కోవర్టులు ఉన్నారనే అంశం బాగా హైలైట్ అవుతుంది.
ఇదే సమయంలో బిజేపిలో కూడా కోవర్టులు ఉన్నారనే అంశం హాట్ టాపిక్ అయింది. అసలు బిజేపిలో కేసిఆర్ మనుషులు ఎవరు అనే చర్చ సాగుతుంది. ఇక జితేందర్ రెడ్డిపై ఈటల కామెంట్ చేయడంతో..బిజేపిలో విభేదాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అలాగే కొందరు నేతలు మాత్రం పార్టీ వదిలేసి వెళ్తారని అర్ధమవుతుంది. ఆ నేతలు ఎవరు అనేది అర్ధం కాకుండా ఉంది. అదే సమయంలో ఈటల సైతం గట్టిగా పార్టీ మారడం లేదని చెప్పడం లేదు..పార్టీ మారడం సులువు కాదని అంటున్నారు గాని..ఖచ్చితంగా మారనని చెప్పడం లేదు. కాబట్టి ఈటల కూడా జంపింగ్ లిస్ట్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది.