ఫేక్ పాలిటిక్స్: మళ్ళీ పీకే మంత్రమేనా?

-

ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండేవి..ఏదైనా విమర్శలు చేసుకున్నా సరే…నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకునే వారు..కానీ ఇప్పుడు రాజకీయాలు అలా లేవు..ఇప్పుడు రాజకీయాల్లో బూతులు మాట్లాడుకోవడమే…ఒకరినొకరు తిట్టుకోవడమే…అలాగే ఈ మధ్య ఫేక్ రాజకీయాలు ఎక్కువ అయ్యాయి…అంటే లేని వాటిని ఉన్నట్లుగా క్రియేట్ చేయడం ఎక్కువైంది. అంటే ఒక నాయకుడు ఏదైనా అంశం గురించి మాట్లాడితే..దాన్ని ఎడిట్ చేసి నానా రకాలుగా చేస్తున్నారు. అలాగే ఒక స్టేట్మెంట్ ని మరొకలా మార్చడం ఎక్కువైంది.

 

ఉదాహరణకు జగన్ ఒక అంశం మీద మాట్లాడితే…దాన్ని ఎడిట్ చేసి ప్రజలకు వేరేలా రీచ్ చేయడానికి ప్రత్యర్ధులు ప్రయత్నిస్తున్నారు. అలాగే చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మార్చేసి వేరేగా చేయడంలో వైసీపీ శ్రేణులు ముందు ఉంటున్నాయి. అసలు ఈ నకిలీ రాజకీయాలు తార స్థాయికి చేరిపోయాయి. అయితే ఈ నకిలీ రాజకీయాలు మొదలైంది…ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యాకే అని రాజకీయ విశేల్శకులు మాట్లాడుకుంటున్నారు. పీక్ ఎంటర్ కాక ముందు వరకు ఏపీ రాజకీయాలు హుందాగానే నడిచాయి…కానీ ఎప్పుడైతే పీకే ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి సీన్ మారిపోయింది. రాజకీయాల్లో బూతులు మాట్లాడటం…నకిలీ స్టేట్మెంట్స్ రావడం మొదలయ్యాయి. అలాగే కులాల మధ్య కుంపటి రాజేయడం లాంటివి జరుగుతున్నాయి.

అయితే ఇప్పటికీ అదే తరహా రాజకీయం నడుస్తుందనే చెప్పాలి…తాజాగా టీడీపీ నేతలకు సంబంచిన స్టేట్మెంట్స్ పూర్తిగా నకిలీవే వచ్చాయి. ఈ మధ్య లోకేశ్ పాదయాత్ర చేయబోతున్నారని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే లోకేశ్‌కు పాదయాత్ర చేసే శక్తి లేదు. దీనిపై వచ్చిన వార్తలు నమ్మవద్దు అని చంద్రబాబు కోరుతున్నట్లుగా… ఏకంగా చంద్రబాబు లెటర్‌ హెడ్‌తో, ఆయనే విడుదల చేసినట్లుగా ఒక నకిలీ ప్రకటనను సృష్టించారు. అలాగే పవన్ తో పొత్తు విషయంలో టీడీపీ నేతలు దురుసుగా మాట్లాడుతున్నట్లు కొన్ని కథనాలు సృష్టించారు. ఇటు టీడీపీ వాళ్ళు కుడా జగన్ కు సంబంధించిన అంశాలని ఫేక్ చేస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఫేక్ అయిపోయాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news