Breaking : కస్తూర్భాలో ఫుడ్‌ పాయిజన్‌.. 35మంది విద్యార్థినిలకు అస్వస్థత

-

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ కస్తూర్భా బాలికల వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. దీంతో 35 మంది విద్యార్థినిలు అస్వస్థతలకు గురయ్యారు. వారిని వెంటనే నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మొదట 10 మంది అస్వస్థతకు గురి కాగా.. తరువాత మరో 25 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలవడంతో విద్యార్థినులను ఆసుపత్రికి తలించారు. అయితే.. ఫుడ్‌ పాయిజన్‌కు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు.

82 girl students fall ill after having hostel food, hospitalised | Erode  News - Times of India

ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి మెస్ లో చపాతి తినడం వల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో.. వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సెంటర్లో చికిత్స అందించారు. అయితే ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. ఈ పరిణామం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news