ఆత్యహత్య చేసుకోవాలన్న ఆలోచన నుంచి.. నేడు కార్పొరేట్‌ సీఈవోగా ఎదిగిన మహిళ..!

-

లైఫ్‌లో కొన్ని సార్లు మనం భరించలేని కష్టాలు వస్తాయి. వాటిని తప్పించుకోవాలని చాలామంది ఆతహత్య చేసుకుంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ కూడా అలాంటిదే.. ఒక స్జేజ్‌లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి.. ఇప్పుడు ఇండియాలోనే అతిపిన్న వయసులో కార్పొరేట్‌ సీఈవోగా ఎదిగింది. శారీరక లోపంతో అడుగడుగునా అవమానాలు, వెక్కిరింతలకు గురైనా రాధిక కథ నేడు ఎంతమందికి ఆదర్శమనే చెప్పాలి.
రాధిక వంకర టింకర మెడతో జన్మించింది. దీనికి తోడు స్పష్టంగా మాట్లాడలేకపోయేది.. దీంతో స్టూడెంట్‌గా అనేక వేధింపులకు, నిరాదరణకు గురైంది. అయినా వాటిని దిగమింగుకుంటూ.. మంచి మార్కులకతో కాలేజీ చదువును కంప్లీట్‌ చేసింది. ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనూ టాలెంట్‌ను కాకుండా.. శారీరక అందానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో… అనేక ఉద్యోగావకాశాలు చేజారి పోయాయి. అయినప్పటికీ తన పట్టుదలను వదలలేదు.. అందరిలా నిరాశతో ఉండిపోలేదు.. రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నించింది. ఓ కార్పొరేట్ సంస్థ ఆ యువతి ప్రతిభకు పట్టం కట్టింది. దీంతో తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 33 ఏళ్ల వయసులో భారత దేశంలో అతి పిన్న వయస్కురాలైన CEOగా చరిత్ర సృష్టించింది.
 ఎడెల్వీస్ MF చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాధికా గుప్తా .. తాను వంకర మెడతో పుట్టడంతో ఎదుర్కొన్న ఇబ్బందులను హ్యూమన్‌స్ ఆఫ్ బాంబేలో వివరించారు. రాధికా తండ్రి… దౌత్యవేత్త. దీంతో ఆమె భారతదేశం, పాకిస్తాన్, న్యూయార్క్‌ వంటి దేశాలతో జీవించేది.. తనను తల్లి అందంతో పోలుస్తూ ఉండేవారని.. దీంతో తాను ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పారు. చాలామంది.. మీ అమ్మతో పోలిస్తే.. నువ్వు చాలా అందవిహీనంగా ఉన్నావంటూ తరచుగా మాట్లాడేవారట.. దీంతో తనకు క్రమంగా విశ్వాసం క్షీణించిందని అప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు గుప్తా… అయితే తన తల్లి ఒక “అద్భుతమైన మహిళ” అని గుప్తా తెలిపారు..
అన్ని అవమానాలు భరించి చదువు కంప్లీట్‌ చేసిన తనకు జాబ్‌ కూడా రాలేదు. 22వయసులో 7వ సారికూడా రిజెక్ట్ అయ్యారు. అప్పుడు తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు మొదలయ్యాయని రాధికా గుప్తా తెలిపారు. తాను కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవలననుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. వెంటనే రాధికా గుప్తా స్నేహితులు ఆమెను మానసిక చికిత్సా విభాగానికి తీసుకెళ్లారు.. అక్కడ ఆమె డిప్రెషన్‌తో ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే తనకు ఇంటర్వ్యూ ఉందని.. ఇదే తన చివరి ప్రయత్నం చెప్పడంతో వార్డునుంచి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అనుమతిచ్చారట. అప్పుడు మెకిన్సేలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. అలా ఉద్యోగంలో అడుగు పెట్టిన 3 సంవత్సరాల తరువాత.. 2008లో మార్పు కావాలనిపించి.. 25 సంవత్సరాల వయస్సులో తిరిగి భారత దేశానికి వచ్చారు. భర్త , స్నేహితునితో కలిసి స్వంత ఆస్తి నిర్వహణ సంస్థను ప్రారంభించింది రాధిక.
కొన్ని సంవత్సరాలకే.. ఆ కంపెనీని Edelweiss MF కొనుగోలు చేసింది. దీంతో రాధికా కార్పొరేట్ రంగం దిశగా అడుగులు వేసింది.. కార్పొరేట్ ఎంప్లాయిస్ అందరూ సూట్స్ ధరిస్తే.. రాధికా గుప్తా భారతీయ సంప్రాదయానికి ప్రతీకగా చీరను ధరించేవారు.అయితే Edelweiss MF CEO కోసం ప్రకటన ఇచ్చిన సమయంలో తన భర్త ఎంతో ప్రోత్సహించారని.. అప్పుడు దరఖాస్తు చేసినట్లు చెప్పారు. కొన్ని నెలల తర్వాత రాధికా గుప్తా Edelweiss MF సీఈవోగా ఎంపికయ్యారు. దీంతో రాధికా గుప్తా 33 సంవత్సరాల వయస్సులో భారతదేశంలోని అతి పిన్న వయసు గల సీఈవోల్లో ఒకరు అయ్యారు.
ఇప్పుడు రాధికా గుప్తా వయసు 39 ఏళ్ళు.. తన లోపాలను అంగీకరించి.. వాటిని అర్ధం చేసుకుని విజయంవైపుగా అడుగులు వేసినట్లు గుప్తా చెప్పారు. అవును.. నా కళ్ళలో ఒకటి మెల్లకన్ను, మెడ వంకర.. అయితే నేను నాకంటూ ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని అది సాధించే దిశగా అడుగులు వేశానని గర్వంగా చెప్తుంది మన రాధికా గుప్తా.! చాలామంది.. ఎదుటివారని వెక్కిరించడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుంటారు. అలా వెక్కరించేవారు.. ఎప్పటికే అక్కడే ఉండిపోతారు. వారి మాటలను పట్టించుకోకుండా.. ముందుకు అడుగులు వేస్తే.. నేడు ఎంతోమంది రాధికా గుప్తాలను పుట్టుకొస్తారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం మనకొక పాఠాన్ని నేర్పిస్తుంది.. ప్రతి పాఠం మనిషిని మారుస్తుంది.. ఏమంటారు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version