బంగారం అందానికే కాదు.. ఆరోగ్యానికి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుందట..!!

-

బంగారం అనేది అలంకార ప్రాయం అని మాత్రమే మనకు తెలుసు.. ఇవి వేసుకోవడం వల్ల అందంగా ఉంటారు అని అనుకుంటాం. బంగారం ఇష్టపడని ఆడవారు ఉండరు ..మీకు తెలుసా బంగారం వేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుందని. ఇది అందానికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందట.. చర్మానికి వచ్చే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్‌ దరిచేరకుండా బంగారం కాపాడుతుందట.

ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడంలో బంగారు ఆభరణాలు ఎంతో ఉపయోగపడతాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా మేనును ఎల్లప్పుడు కాపాడుతుంది.

బంగారం వేసవిలో శరీరాన్ని చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉంచుతుంది.

బంగారు ఆభరణాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంపై ఏదైనా గాయం తగిలితే, గాయం త్వరగా నయం అయ్యేలా బంగారం చేస్తుంది.

బంగారంలో చర్మాన్ని మెరుగుపరిచే అనేక ఖనిజాలు ఉంటాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి బంగారు ఆభరణాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాకుండా నిద్ర సమయంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.

అంతేకాదు.. వేసుకునే ఒక్కో ఆభరణం ఆరోగ్యానికి ఒక్కో విధంగా మేలు చేస్తుంది. ముక్కుపుడక ధరించడం వల్ల మాట్లాడే సమయంలో పై పెదవికి తగిలి వీలైనంత వరకూ తక్కువగా మాట్లాడమని సూచిస్తుందట. ముక్కెర ధరించడం వల్ల ముక్కు కొనపై ఏదోవిధంగా దృష్టి ఉంటుంది.అలా దృష్టి ఉండడం ధ్యానంలో ఒక భాగం. అలా చెడు శ్వాస కలిగిన గాలిని బంగారం పవిత్రం చేస్తుందట.

గర్భకోశము కదలి లోపల ఉన్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది.

చేతికి గాజులు వేసుకోవడం వల్ల మణికట్టు మీద ఉన్న నరాలు ఉత్తేజితమవుతాయి. తద్వారా మనల్ని ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. భలే క్రేజీగా ఉంది కదూ..!

చంద్రవంకను తల మధ్య ప్రదేశంలో ధరిస్తారు. ఆ ప్రాంతం నుంచి మన జీవనాధారం అయిన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు.

హృదయంలో పరమాత్ముడున్నాడు. ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ కంఠాన నగలు ధరిస్తుంటారు. తెలిసీ తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుందట.. బంగారం ధరించటం ద్వారా చెడు కలలు రాకపోవటమే కాదు. అవి గుండె మీద తగులుతూ ఉండడం వలన అది గుండెకు చేరుతుందట. కాబట్టి బంగారు నగలను ధరించడం వలన గుండె సంబంధిత వ్యాధులకు కూడా మనం దూరంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news