గుడ్ న్యూస్ : ఈ నెల 27 నుంచి అంత‌ర్జాతీయ విమాన సేవ‌లు

-

అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణికుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. క‌రోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కార‌ణంగా అంత‌ర్జాతీయ విమాన సేవ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిలిపివేసింది. తాజా గా అంత‌ర్జాతీయ విమాన సేవ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ నెల 27 నుంచి అంత‌ర్జాతీయ విమాన సేవ‌ల‌ను పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభిస్తున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కాగ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు క‌రోనా నియంత్ర‌ణ‌కు టీకాలు తీసుకోవ‌డంతో.. ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని డీజీసీఏ అధికారులు తెలిపారు.

కాగ క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా.. 2020 మార్చి నెల‌లో అంత‌ర్జాతీయ విమాన సేవ‌లపై కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగూణంగా డీజీసీఏ బ్యాన్ విధించింది. త‌ర్వాత ఈ బ్యాన్ ను డీజీసీఏ పొడిగిస్తు.. వ‌స్తుంది. చివ‌రిగా ఈ బ్యాన్ గ‌త నెల 28 న పొడిగించారు. కాగ తాజా గా ఇప్పుడు అంత‌ర్జాతీయ విమాన సేవ‌ల‌పై బ్యాన్ ను పూర్తిగా ఎత్తివేవారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ నెల 27 వ తేదీ నుంచి అంత‌ర్జాతీయ విమాన సేవ‌లు అందుబాటు లోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version