కంటి వెలుగుతో ప్రజలకు ఆనందం.. ప్రతిపక్షాలకు కన్నీళ్లు – హరీష్ రావు

-

కంటి వెలుగు పథకంతో ప్రజలకు ఆనందభాష్పాలు వస్తుంటే.. ప్రతిపక్షాలకు మాత్రం కన్నీళ్లు వస్తున్నాయని విమర్శించారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆలోచనలతో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతుందన్నారు. తెలంగాణలో 50 లక్షల మందికి కంటి వెలుగు టెస్టులు చేసినట్లు చెప్పారు.

మొదటి స్థానంలో సిద్దిపేట జిల్లా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ఆసుపత్రిలో వద్దకు ప్రజలు రావడం కాదు, ప్రతి ఊరికి, వాడకు ప్రభుత్వమే కదిలి వస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీ సీఎం ప్రశంసించారని చెప్పారు. ఉచితంగా కంప్యూటర్ ఐసేడ్ కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, అవసరం అయినవారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తుందని తెలిపారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఈ కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version