హ్యాట్సాఫ్ టు ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ – హరీష్ రావు

-

రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ బస్టాప్ వద్ద ఓ యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు ఏమైందోనని ఆందోళన చెందారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్​కు కాల్ చేశారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ ఇదంతా గమనించాడు. జనం గుమిగూడటంతో అటుగా వెళ్లి ఏమైందోనని చూశారు కానిస్టేబుల్ రాజశేఖర్.

ఓ యువకుడి కుప్పకూలడం గమనించి సమయస్ఫూర్తితో వెంటనే అతడికి సీపీఆర్ చేశారు. సీపీఆర్​కు స్పందించిన యువకుడు చాలాసేపటి తర్వాత కళ్లు తెరిచాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు చెప్పారని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై మంత్రి హరీష్‌ రావు స్పందించారు. హ్యాట్సాఫ్ టు ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ అంటూ హరీష్ రావు ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version