హస్తంలో మళ్ళీ కుస్తీ: రేవంత్ లిమిట్ దాటేశారా?

-

ఏదో ఒకరోజు, రెండు రోజులే కాంగ్రెస్ పార్టీలో ఏ విభేదాలు ఉన్నట్లు కనిపించవు…కానీ మళ్ళీ వెంటనే కాంగ్రెస్ లో రచ్చ మొదలైపోతుంది…అసలు రచ్చ లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఎందుకు అవుతారు. ఇక ఎప్పటిలాగానే తాజాగా కూడా హస్తం పార్టీలో మళ్ళీ కుస్తీ మొదలైంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా…తెలంగాణ రాక…హస్తం పార్టీలో వివాదాలకు కారణమైంది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

యశ్వంత్ కు కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలుపుతున్న విషయం తెలిసిందే…అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యర్ధిగా ఉన్న టీఆర్ఎస్ సైతం యశ్వంత్ కు మద్ధతు ఇస్తుంది. ఈ క్రమంలోనే యశ్వంత్ హైదరాబాద్ కు వచ్చారు…ఇక యశ్వంత్ కు టీఆర్ఎస్ భారీగా స్థాయిలో స్వాగతం పలికింది…పైగా కేసీఆర్ తో కలిసి యశ్వంత్ రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

అయితే కేసీఆర్ ని కలిసిన యశ్వంత్ ని కాంగ్రెస్ పార్టీ నేతలు కలవడానికి వీల్లేదని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పైగా జాతీయ నాయకత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని అన్నారు. కానీ రేవంత్ ఆదేశాలు పట్టించుకోకుండా…సీనియర్ నేత వి. హనుమంతరావు…యశ్వంత్ ని కలిశారు…దీనిపై రేవంత్ స్పందిస్తూ…ఆదేశాలు పాటించకపోతే..తమ నేతలని గొడకేసి బాదుతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై జగ్గారెడ్డి వెంటనే స్పందిస్తూ…రేవంత్ పై ఫైర్ అయ్యారు.

ఇష్టం వచ్చినట్టు అంటే ఇక్కడ నౌకర్లు ఎవరూ లేరని, రేవంత్ రెడ్డి చాలా రాంగ్ స్టెప్ వేశారని, టెంప్ట్ అయ్యేవారు ఆ పదవికి అర్హులు కాదని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తప్పు చేశారని, క్షమాపణ చెప్పి తీరాలని, పైగా ఈ వ్యవహారంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ కూడా రాస్తానన్నారు. అయితే రేవంత్ కాస్త నోరు జారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అంటే అధిష్టానం సపోర్ట్ ఉండటం వల్లే ఇలా రేవంత్ మాట్లాడారా…లేక పి‌సి‌సి అని మాట్లాడారో క్లారిటీ లేదు. ఇక రేవంత్ ఎప్పుడు దొరుకుతారని కాచుకుని కూర్చున్న సీనియర్లకు…ఇప్పుడు రేవంత్ ని ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం దొరికిందనే చెప్పాలి. మరి చూడాలి ఇంకా ఈ రచ్చ ఎంతవరకు వెళుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news