సినీ పరిశ్రమలో టాప్ ప్లేస్ లో దక్కించుకోవాలి అంటే అందుకు తగ్గట్టుగా సక్సెస్ అనేది చాలా ముఖ్యమని చెప్పవచ్చు. అది ఎప్పుడూ కేవలం ఒకరి దగ్గర మాత్రమే ఉండదు.. అయితే అలా అపజయం ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందిన కొరటాల శివ ఆచార్య సినిమాతో గట్టి ప్లాపును అందుకున్నారు. ఇక అంతేకాకుండా డైరెక్టర్ శంకర్, బోయపాటి శ్రీను తదితర దర్శకులకు సైతం ప్లాపుల నుంచి తప్పుకోలేకపోయారు. అయితే కొంతమంది డైరెక్టర్లు మాత్రం తమ హిట్టు ట్రాక్ను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి కష్టానికి తగ్గట్టుగా ఫలితం ఇస్తున్న డైరెక్టర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1). రాజమౌళి:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందిన డైరెక్టర్ గా పేరు పొందారు రాజమౌళి. రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలు తెరకెక్కించగా అవి అన్ని హిట్టుగా నిలిచాయి
2) వెట్రి మారన్:
కోలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ సినిమాని తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక అంతకుముందు మాస్టర్ సినిమాని తెరకెక్కించి కూడా మంచి కమర్షియల్ హిట్టుగా పేరుపొందారు.
3). ప్రశాంత్ నీల్:
కన్నడ స్టార్ డైరెక్టర్ గా పేరుపొంది ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కించారు. ఆ సినిమాలు అన్ని మంచి విజయాలని అందుకున్నాయి.
4). అట్లీ:
తమిళ స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన అట్లీ వరుసగా నాలుగు సినిమాలను హిట్ కొట్టి ప్రస్తుతం షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా నీ తెరకెక్కిస్తున్నారు.
5) అనిల్ రావిపూడి:
టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ లిస్టులో ప్రస్తుతం కొనసాగుతున్నారు అనిల్ రావిపూడి. ఈయన తెరకెక్కించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి.
6) వెంకీ కుడుముల:
టాలీవుడ్లో ఛలో, భీష్మ వంటి రెండు చిత్రాలు తెరకెక్కించాక ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నారు.
7) నాగ్ అశ్విన్:
టాలీవుడ్లో మహానటి ,ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ k సినిమాని తెరకెక్కిస్తున్నారు.
8) రవికాంత్ పేరేవు:
క్షణం ,కృష్ణ అండ్ హిస్ లీల వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న యువ డైరెక్టర్ మంచి సక్సెస్ ట్రాక్ తో దూసుకుపోతున్నారు.