హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి వర్షం దంచికొట్టింది. దీంతో హైదరాబాద్ పట్టణం తడిసి ముద్దైంది. పలు చోట్ల వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే మరో రెండు గంటలపాటు ఈ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.