తమిళ హీరో తాజాగా విశాల్ ‘లాఠీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ ఆశలతో ఈ చిత్రం విడుదల సందర్భం గా హీరో విశాల్ తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్స్ కోసం చాలా పడ్డాడు. తాను మోహన్ బాబు తో కలసి చేసిన ఈవెంట్ ఫోటోస్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
విశాల్ చేసిన వ్యాఖ్యల ద్వారా తన మీద వైసీపీ ముద్ర పడింది. వాస్తవానికి ఈ సినిమా కు తెలుగు రాష్ట్రాల్లో రూ 4 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తొలి షో నుంచే లాఠీ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది. తొలిరోజు లాఠీ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం 65 లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టింది.వాస్తవానికి విశాల్ కు మినిమం రేంజ్ వసూళ్ళు వస్తాయి. ఇక శుక్రవారం నాడు తెలుగు సినిమా లు 18 పేజెస్ మరియు ధమాకా రిలీజ్ ఉండటం వల్ల వసూళ్ళు మరింత తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు.
దీనికి కారణం సినిమాలో అతి యాక్షన్ తో పాటు తన వ్యాఖ్యలే అని అంటున్నారు.సినిమా ప్రచార కార్యక్రమాల్లో విశాల్ తన ఓటు జగన్ కే అని చెప్పడం, దీనితో చాలా మంది టిటిడి, జనసేన మద్దతుదారులు లాఠీ చిత్రాన్ని చూసేందుకు ఇష్టపడలేదు. ఫలితంగా లాఠీ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్ళు రాబట్టలేదు. ఇలాగే ఉంటే తన ఖాతాలో మరో ప్లాప్ జమ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.