తన అందాలతో స్వర్గాన్ని మైమరపిస్తున్న హనీ రోజ్..!

-

మాలీవుడ్ బ్యూటీ హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో కొన్ని సినిమాలలో నటించినా పెద్దగా కలిసి రాలేదు. కానీ ఇటీవల బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది హనీ రోజ్. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం లో యూత్ ఫేవరెట్ యాక్టర్ గా మారిపోయింది. ఈ వర్షం సాక్షిగా, ఆలయం వంటి తెలుగు చిత్రాలలో నటించిన ఈమెకు అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని చెప్పాలి.

హనీ రోజ్ కి ఎంతలా అదృష్టం కలిసి వచ్చింది అంటే.. ఏ పార్టీ అయినా. ఫంక్షన్ అయినా.. ఈవెంట్ అయినా.. ఆఖరికి మాల్ ఓపెనింగ్ అయినా సరే ముందుగా ఇన్వైట్ చేసేది ఈమెనే.. ఇక ఈమె క్రేజ్ చూసి అటు స్టార్ హీరోయిన్లు కూడా కుళ్లుకునే స్టేజ్ కి వచ్చారు అంటే ఇక అభిమానులలో ఈమెకు ఏ రేంజ్ లో పాపులారిటీ లభించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో వరుసగా గ్లామర్ ఫోటోస్ తో యువతను ఆకట్టుకుంటున్న ఈమె అంతకుమించి వయ్యారాలు ఒలకబోస్తోంది.

ప్రస్తుతం గ్లామర్ షో నే ప్రధాన అంశంగా మార్చుకున్న హనీ రోజ్ రోజురోజుకి తన గ్లామర్ డోస్ పెంచేసి యువతకు చెమటలు పట్టిస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే 30 సంవత్సరాల వయసులో కూడా వన్నెతెరగని అందంతో యువతను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా లావెండర్ కలర్ శారీలో మరొకసారి మురిపించింది. అంతేకాదు ఈమెను అలా చూస్తుంటే స్వర్గమే దిగి వచ్చిందా అన్నట్లుగా అనిపిస్తోందని నెటిజన్స్ సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే హానీ రోజ్ ధరించిన ఈ సారీ ఆమె అందానికి నిలువుటద్దంగా మారింది. ఏది ఏమైనా ఈమె అందాల సోయగం ముందు ఎంతటి వారైనా దిగదుడిపే అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version