పక్షులు కిందపడకుండా చెట్లపైన ఎలా నిద్రిస్తాయి.. వాటి కాళ్ల నరాల నిర్మాణం ప్రత్యేకత ఏంటంటే!

-

పక్షులు చెట్లమీద గూళ్లు కట్టుకుని ఉంటాయి. మరికొన్ని చీకటిపడగానే చెట్లకొమ్మల మీద నిద్రస్తాయి. ఒక్కోసారి మీరు గమనించారా..ఒంటికాలుమీద నిలబడి ఏమాత్రం తొణక్కుండా అలానే ఉంటాయి. మనుషులు కూడా ఇలా ఉండలేరు. కాసేపటికే బ్యాలెన్స్ తప్పి కాలు దించేస్తాం. ఎలా పక్షులకు ఇది సాధ్యం అయిందో ఇప్పుడు చూద్దాం.

పక్షుల కాళ్లలో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కిందపడకుండా కాపాడుతుందట. పక్షుల కాళ్లలో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలుంటాయి. ఇవి పక్షుల కాళ్లలో తొడభాగంలోని కండరాలనుంచి మోకాళ్లద్వారా కాలి చివరి వరకు అక్కడి నుంచి మడమచుట్టూ వ్యాపించి కాలివేళ్ల కింద దాకా ఉంటాయట. ఎప్పుడైతే పక్షి కొమ్మలపై వాలుతుందో..అప్పడు పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్లపై వంగేట్టు చేస్తుంది. అప్పుడు కాళ్లలోని నరాలు వాటంతటవే బిగుసుకుపోతాయట.

దాంతో కాలిగోళ్లు ముడుచుకొని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్లని నేరుగా సాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు కిందపడిపోకుండా కొమ్మలపై నిద్రపోగలుగుతాయి..ఈ విషయం ఆ పక్షులకు కూడా తెలియదేమో కదా..పక్షుల కాలిగోళ్లు కొమ్మలను ఎంత గట్టిగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి అక్కడ చనిపోయినా కిందపడిపోవు.

పక్షులు ఉష్ణ రక్త జీవులు. అవి ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి అవి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి ఈ చరమాంగాలు ఉపయోగపడతాయి. వీటి శరీరం ఈకలతో కప్పి ఉంటుంది

కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా పక్షులలో రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను ఉడ్డయక కండరాలు అంటారు. ఆహారవాహిక అన్నాశయంగా విస్తరించి ఆహార పదార్ధాల నిల్వకు ఇది తోడ్పడుతుంది. పక్షుల్లో నాలుగు గదుల గుండె ఉంటుంది. సిరాసరణి, మూలమహాధమనులు ఉండవు.

కుడి దైహిక చాపం ఉంటుంది. ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉంటాయి. ఇవి 9 వాయుగోణులను కలిగి ఉంటాయట. నోరు లేని జీవి అయినా..పక్షుల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. అవి వాటిని జీవితానికి తగ్గట్టుగా ఇలాంటి ప్రత్యేకతలను ఆ దేవుడే ఇచ్చాడని కొందరు అంటారు. మరికొందరు సైన్స్ అంటారు. పక్షుల్లోనే కాదు..చీమల్లోకూడా వాటి శరీరభాగాలు మనకు ఆశ్యర్యాన్ని కలిగిస్తాయి. ఒక చీమ జీవితకాలం 15సంవత్సరాలట..కానీ మనం అది మన రెండువేళ్లతో నలిపేస్తుంటాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version