మునుగోడులో కమలం బలం ఎంత?

-

మునుగోడు..ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు…ఈ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు…ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు…ఇక స్పీకర్ కు రాజీనామా లేఖని పంపి ఆమోదింపజేసుకోవాలని రాజగోపాల్ ప్రయత్నిస్తున్నారు..ఆ వెంటనే బీజేపీలో చేరి…ఉపఎన్నికల బరిలో నిలబడనున్నారు. మొత్తానికైతే మునుగోడు ఉపఎన్నిక రానుంది. మరి మునుగోడులో ఒకసారి పార్టీ బలబలాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా బీజేపీ బలం గురించి…ఎందుకంటే ఇప్పటివరకు మునుగోడులో బీజేపీ సత్తా చాటిన సందర్భాలు లేవు…కనీసం రెండో స్థానంలో కూడా నిలబడలేదు. ఇక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులకు బలం ఎక్కువ. కమ్యూనిస్టుల హవా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీఆర్ఎస్ బలం పెరిగింది. 2014లో ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది. అయితే అప్పుడు ఇండిపెండెంట్ గా బరిలో దిగిన పాల్వాయి స్రవంతి రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.

ఆ పార్టీకి 27,434 ఓట్లు పడ్డాయి…ఇన్ని ఓట్లు రావడానికి కారణం..అప్పుడు బీజేపీతో టీడీపీకి పొత్తు ఉంది. ఇక 2018 ఎన్నికలోచ్చేసరికి కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాదాపు 22 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక సెకండ్ ప్లేస్ లో టీఆర్ఎస్ నిలిచింది. 12,725 ఓట్ల తెచ్చుకుని బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. అంటే బీజేపీ సింగిల్ గా పోటీ చేసి..ఈ స్థానానికి పరిమితమైంది. అయితే రాష్ట్రంలో నిదానంగా బీజేపీ బలం పెరుగుతుంది. అలా అని మునుగోడులో బీజేపీ బలం పెరగాలని రూల్ లేదు. సరే ఎంతోకొంత పెరిగే ఛాన్స్ ఉందని అనుకోవచ్చు..కానీ గెలిచెంత బలం రాకపోవచ్చు.

అయితే కోమటిరెడ్డి మాత్రమే బీజేపీ మెయిన్ బలం. ఆయన బట్టే బీజేపీ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఓటర్లు…కోమటిరెడ్డి వైపుకు వస్తారా? అనేది చెప్పలేం. అదే సమయంలో కోమటిరెడ్డి గత ఎన్నికల్లో గెలుపుకు…టీడీపీ, కమ్యూనిస్టులు సహకరించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో టీడీపీ, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీల పొత్తు ఉంది. ఇప్పుడు అక్కడ కమ్యూనిస్టులకు ఎంతోకొంత బలం ఉంది..వారు ఎలా చూసుకున్న బీజేపీ వైపు రారు. అటు ఉన్న కొద్ది టీడీపీ ఓటర్లు సైతం…రేవంత్ రెడ్డిని బట్టి కాంగ్రెస్ వైపే నిలబడొచ్చు.

అంటే బీజేపీకి ఉన్న 12-15 వేల ఓట్ల బలం…ప్లస్ కోమటిరెడ్డి ఇమేజ్ తో…మునుగోడులో గెలవాల్సిన పరిస్తితి. కానీ ఇక్కడొక ఇంకో ట్విస్ట్ ఉంది…ప్రభుత్వ వ్యతిరేక ఓటు…అది మూకుమ్మడిగా కోమటిరెడ్డికి పడితే…బీజేపీ గెలుపు ఈజీ..లేదంటే మునుగోడులో గెలుపు కోసం బీజేపీ చాలా కష్టపడాలి.

Read more RELATED
Recommended to you

Latest news