స్టార్ హీరోతో చెప్పులు మోయించిన నటి.. షాక్​లో నెటిజన్లు

-

ముంబయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్​ ఈవెంట్​కు హాలీవుడ్, బాలీవుడ్ తారలు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్​లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే చాలా ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఓ ఫొటో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అదేంటంటే..?

బాలీవుడ్ హ్యాండ్సమ్.. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ ఈవెంట్​కు తన గర్ల్​ఫ్రెండ్ సబా ఆజాద్​తో కలిసి వచ్చాడు. సభా రెడ్ కలర్ ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో కనిపించగా.. హృతిక్ బ్లాక్ కలర్ శర్వాణీలో సందడి చేశాడు. అయితే సబా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్​ అమిత్ అగర్వాల్​తో ఫొటో దిగుతుండగా వెనకాలే.. హృతిక్ తన చేతిలో హీల్స్ పట్టుకుని కనిపించాడు. ఈ ఫొటోలను చూసిన అభిమానులు షాక్​కు గురయ్యారు. లవర్​ హీల్స్‌ను చేతుల్లో మోస్తున్న హృతిక్ సింప్లిసిటీకి మెచ్చుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

సబా, హృతిక్​ రోషన్​ కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తరచూ ఈ జంట చట్టాపట్టాలేసుకుని తిరగడం.. కలిసి వెకేషన్లకు వెళ్లడం.. ఫ్యామిలీ పార్టీల్లో కలిసి ఉండటం చూసి వీళ్లిద్దరు రిలేషన్​షిప్​లో ఉన్నట్లు నెటిజన్లు కన్​ఫామ్ చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version