బీజేపీ నేతలకు నిరంజన్ రెడ్డి సవాల్.. దమ్ముంటే ధాన్యం కొనుగోలుకు లేఖ తీసుకురండి

-

గత నాలుగు నెలలుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్రం, కేంద్రాన్ని కోరుతోందని, వరిని కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏంటని కేంద్రాన్ని నిలదీస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ధాన్యాన్ని కొంటామని కేంద్రం నుంచి లేఖ తీసుకురావాలని సవాల్ చేశారు. సాయంత్రం 5 గంటల లోగా కేంద్రం నుంచి లేఖ తీసుకురావాలని లేఖ పోతే రాజీనామ చేయాలని బండి సంజయ్, కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. హుజూరాబాద్ లో వరిని పండిస్తున్న రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఇప్పటికే సీఎం చెప్పారని గుర్తు చేశారు.ఈటెల భూకబ్జాదారుడిగా తేలిన తర్వాతే ప్రభుత్వం నుంచి తప్పుకున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. విలువలు, సిద్ధాంతాలు వదిలిపెట్టి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. పదవులు, అధికారాన్ని ఇచ్చిన కేసీఆర్నే బొందపెడతా అని మాట్లాడుతున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఎవరిని బద్నాం చేయడానికి బీజేపీ రైతు దీక్ష చేస్తుందని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని చెప్పింది కేంద్రమే కాదా..? అని ప్రశ్నించారు. రాజకీయం కోసం రైతులను పణంగా పెడుతున్నారని బీజేపీని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version