చికెన్ ను ఇలా తింటే మృత్యువు పొంచి ఉన్నట్లే..ఏం చెయ్యాలి?

-

నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ మంది చికెన్ ను ఎక్కువగా ఇష్టపడతారు..ప్రొటీన్లు ఎక్కువుగా ఉండటంతోపాటు అందరికి అందుబాటు ధరల్లో దొరకడంతో చికెన్‌ తినేవారి సంఖ్య ఎక్కవుగానే ఉంటుంది..ఇంట్లో చికెన్ ను వండుకొని తినేవాల్లు షాపు నుంచి తీసుకురాగానే.. నీటితో కడిగి శుభ్రం చేసుకోవడం అలవాటు. కాని చికెన్‌ను కడగడం ప్రమాదకరం అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చికెన్‌ను సరిగ్గా శుభ్రం చేయకపోతే ప్రమాదం కదా.. క్లీన్ చేస్తే ప్రమాదం ఎందుకు అనే ప్రశ్న కూడా మీ మదిలో మెదలడం సహజం. మొదటగా ఎవరైనా చికెన్ లేదా ఇతర నాన్ వెజ్ పదార్థాలు ఏవైనా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కావల్సిన విధంగా వండుకుంటారు. కాని చికెన్ విషయంలో ఇలా శుభ్రం చేసి వండుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి.

చికెన్ను కడిగేటప్పుడు మాంసం మీద ఉండే బ్యాక్టిరియా చేతులకు సోకడం తర్వాత ఆ బ్యాక్టిరియా కడపులోకి చేరు అవకాశం ఉంటుందంటున్నారు..పచ్చి కోడి మాంసం మీద సాల్మోనెల్ల, క్యాంపిలోబ్యాక్టర్ వంటి బ్యాక్టిరీయాలు ఉంటాయి. కుళాయి కింద పెట్టి చికెన్‌ను కడిగేటప్పుడు నీళ్లు చిమ్మడం వల్ల వంట పాత్రలు, దుస్తులు, చేతులు తుడుచుకునే క్లాత్ వంటి వాటికి ఈ బ్యాక్టిరియా సోకుతుంది. మనం చికెన్ ను కుళాయి కింద కడిగేటప్పుడు నీళ్లు చిమ్మి చుట్టూ ఉన్న వాటిపై పడితే వాటిపై కూడా బ్యాక్టిరియా చేరుతుంది. కొన్ని సందర్భాల్లో చికెన్ కడగడానికి ముందే కత్తితో వాటిని కొంతమంది చిన్న ముక్కలుగా చేస్తారు. ఆ సందర్భంలో లేదా కుళాయి పక్కన కత్తి ఉన్నా బ్యాక్టిరియా ఆ కత్తిమీదకు చేరుతుంది. ఆ తర్వాత ఆ కత్తితో ఇతర కూరగాయలు, లేదా పండ్లు వంటివి కోసుకుని తింటే ఆ బ్యాక్టిరియా శరీరంలోకి వెళ్తుంది.

క్యాంపిలో బ్యాక్టిరియా అనేది చాలా ప్రమాదకరమైనది.. డయేరియా, పొత్తికడుపులో నొప్పి, వాంతులు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ బ్యాక్టిరియా వల్ల సోకే రోగాలు కొందరిలో కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. కాని మరికొందరిలో అయితే వారి ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. క్యాంపిలోబ్యా్క్టర్ ఇరిటుల్ బౌల్ సిండ్రోమ్ కు దారితీస్తుంది. దీని వల్ల పొత్తి కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, డయారేయా, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఈ బ్యాక్టిరియా వల్ల తలెత్తే మరో వ్యాధి గ్యాంబరే సిండ్రోమ్. ఈ రుగ్మత వల్ల అలసట, ఒళ్లు మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరంలో ఉంటే వెంటనే జాగ్రత్తపడి వైద్య పరీక్షలు చేయించుకోవాలి..

ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే.. చికెన్ ను కడగడం కన్నా కూడా తగిన మోతాదులో ఉడికించాలి. చికెన్ పై ఉండే రక్తపు మరకులు వంటివి ఇబ్బందికరంగా అనిపిస్తే టిష్యూ పేపర్, లేదా పేపర్ టవల్ తో శుభ్రం చేయాలి. అలా చేసిన వాటిని మళ్లీ ఉపయోగించకుండా చెత్తబుట్టలో పడేయాలి. పచ్చి మాంసాన్ని ఫ్రిజ్ లో పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర ఆహార పదార్థాలతో కలవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చికెన్ ముక్కలు చేయడానికి ఉపయోగించే చాపింగ్ బోర్డు, కత్తి, చికెన్ ఉంచేందుకు వాడే పాత్రలను శుభ్రంగా కడగాలి..చికెన్ ను కడిగిన తర్వాత వెంటనే చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version