ఆకట్టుకుంటున్న అమిగోస్ ట్రైలర్..యాక్షన్ సీన్స్ హైలెట్..

-

నందమూరి కళ్యాణ్ రామ్ బింసారా హిట్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందించింది.ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌, టీజర్, పాటలు సినిమాపై మాంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి..

 

ఈ సినిమా నుంచి తాజాగా విడుదల అయినా సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నందమూరి బాలకృష్ణ సూపర్‌ హిట్‌ సాంగ్‌కు ఇది రీమిక్స్‌. గతంలో బాలయ్య నటించిన ‘ధర్మక్షేత్రం’ సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను దివంగత లెజెండరి సింగర్‌ బాలు – చిత్ర ఆలపించారు. అదే పాటలను అమిగోస్‌లో రిమేక్‌ చేయించాడు కల్యాణ్‌ రామ్‌. ఇప్పుడు ట్రైలర్ ను చిత్రాయూనిట్ రిలీజ్ చేశారు..రామ్ రెండు క్యారెక్టర్ లను చూపించారు.. కాస్త రొమాన్స్, కాస్త వైలెన్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు.. సరికొత్త కథతో రాబోతుందని తెలుస్తుంది.. ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి..గిబ్రాన్‌ సింగీతం అందించిన ఈ పాటను ఎస్పీ చరణ్‌-సమీరా భరద్వాజ్‌లు ఆలపించారు. ​కాగా ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version