ఆ ఆలయంలో సలసల మరిగే నీటిని ఒంటిపై పోసుకుంటారు.. ఇంకా గొలుసులతో కట్టేసుకుని…

-

మన దేశంలో ఎన్నోే ఆలయాలు ఉన్నాయి.. వాటి వెనుక ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. గమ్మత్తైన విషయాలు కూడా.. దెయ్యాలు వదలాలంటే.. రాజస్థాన్ లోని.. మహేందీపూర్ బాలాజీ ఆలయం ఫేమస్.. కేరళలోని ఓ ఆలయంలో.. కత్తులతో దాడులు చేసుకుంటారు.. రక్తం ప్రవాహంలా మారుతుంది.. వేడి వేడి నీటిన వంటిపై పోసుకుంటారు.. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి.. మన తిరుపతిలో తలనీలాలు ఇచ్చే జట్టు ఏం అవుతుందో తెలుసా..? అసలు వాటి మీద వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

మహేందీపూర్ బాలాజీ ఆలయం..

“దెయ్యాలూ, భూతాలూ, పిశాచాలూ, చేతబడుల వంటివి వదిలిపోవాలంటే రాజస్థాన్ లోని.. మహేందీపూర్ బాలాజీ ఆలయం ఫేమస్.. దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్. రోజూ వేల మంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు. వాళ్లు చూపించే భక్తి… భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే… గొలుసులతో కట్టేసుకుని… తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే… తమను దెయ్యాలు వదిలిపోవాలట.. మీరు కానీ ఇక్కడకు వెళ్తే.. వెన్నులోంచి వణుకు పుట్టాల్సిందే.. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. ఆలయం నుంచీ వెళ్లిపోయేటప్పుడు… వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూస్తే… దెయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇదంతా ఎంతవరకూ నిజం అనేది వాళ్లకే తెలియాలి.

కొడుంగల్లూర్ భగవతీ ఆలయం

ఈ టెంపుల్‌కి వెళ్తే మాత్రం భజన కాదు.. తిట్టుకోవాల్సిందే… కేరళలోని కొడుంగల్లూర్ భగవతీ ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజులపాటూ ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైమ్‌లో భక్తులు… కత్తులతో తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్లోకి వెళ్తారు. భద్రకాళీ అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు… భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ… గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటోంది. ఇక్కడ పూజా-కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఏవీ ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత… వారం పాటూ ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైమ్‌లో… రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు.

స్తంభలేశ్వర్ మహదేవ్ ఆలయం

అప్పుడప్పుడూ మాయమై… తిరిగి కనిపించే టెంపుల్‌కి వెళ్లాలంటే ఈ టెంపుల్ కి వెళ్లొచ్చు.. గుజరాత్.. వడోదరలోని స్తంభలేశ్వర్ మహదేవ్ ఆలంయం.. అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంటుంది. ఇక్కడి ఈశ్వరుడు… ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చేవాళ్లను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు… ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వత తిరిగి కనిపిస్తుంది.

తిరుమల టెంపుల్

ఈ టెంపుల్ గురించి ఏం స్పెషల్ ఉందిరా.. మనం అంతా ఎప్పూడూ వెళ్తూనే ఉంటాం కదా.. ఏం గమనించలేదు అనుకుంటున్నారా.. పూజలు, భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు. కేశ సంపద మరో ఎత్తు. తిరుపతి వెళ్తే గుండుకొట్టించుకోకుండా ఉండరూ.. దాదాపు అందరూ కేశఖండన చేయించుకుంటారు. రోజూ ఈ ఆలయంలో 60 వేల మంది దాకా తలనీలాల రూపంలో మొక్కు చెల్లిస్తున్నారు. అందువల్ల ఏటా వందల టన్నుల కొద్దీ జుట్టు పోగవుతోంది. దీన్ని ఈ-వేలంలో అమ్మితే… TTDకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత… ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే తెలుసా… టీటీడీ నుంచీ… ఈ జుట్టు విదేశాలకు వెళ్తోంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్‌పోర్ట్ అవుతోంది. అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్‌తో విగ్స్ తయారుచేస్తున్నాయి. చైనాలో విగ్స్‌తోపాటూ… ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతున్నారు.

జ్వాలా దేవీ ఆలయం..

హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో జ్వాలా దేవి ఆలయం ఉంది. పరమశివుడి భార్య సతీ దేవి ఆలయం ఇది. ఈ ఆలయ ప్రాంగణలో ఉండే జ్వాల… వందేళ్లుగా వెలుగుతూనే ఉంది. దానికి ఇంధనంగానీ, నూనె గానీ పోయకుండానే… జ్వల అలా వెలుగుతూనే ఉంది.. దీని వెనక ఓ కథ ప్రచారంలో ఉంది. సతీదేవి తండ్రి… శివుణ్ని తిరస్కరించడంతో… మనస్థాపం చెందిన సతీదేవి ఆత్మహత్య చేసుకుంది. శ్రీమహావిష్ణువు ఆమె దేహాన్ని 51 ముక్కలుగా చేయగా… అవి భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయట.. సతీ దేవి నాలిక… ఇక్కడ పడి… అదే జ్వాలగా వెలుగుతోందని స్థానికుల నమ్మకం. ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేశాయి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version