జనవరి 3 నుంచి కేప్ టౌన్ లో సౌత్ ఆఫ్రికా తో జరగబోయే రెండవ టెస్ట్ మ్యాచ్ కు బీసీసీ కీలకం మార్పు చేసింది. ఇండియన్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా ఇంకా జట్టులో కి చేరకపోవడంతో అతని స్థానంలో ఆవేష్ ఖాన్ కు చోటు కల్పించింది.
అయితే ముందుగా దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా టెస్ట్ సిరీస్ కి షమీని సెలెక్ట్ చేసింది. కానీ సిరీస్ ప్రారంభం అయ్యే నాటికి షమీ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయాడు. పూర్తి ఫిట్నెస్ కోసం బీసీసీఐ ఎదురు చూడడంతో సెంచూరియన్ లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ కి షమీ దూరం కావాల్సి వచ్చింది. అయితే రెండో టెస్ట్ సిరీస్ ఆరంభం నాటికి కూడా షమీ ఫిట్నెస్ సాధించే అవకాశం లేకపోవడంతో అతని స్థానంలో ఆవేష్ ఖాన్ ని సెలెక్ట్ చేసింది. ఆవేశ్ ఖాన్ ఇప్పటివరకు 39 ఫస్ట్ క్లాస్ గేములలో 149 వికెట్లు పడగొట్టాడు.
రెండో టెస్టు కు ఎంపికైన ఇండియన్ టీం : రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లి,కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా,ఆర్ అశ్విన్,మొహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ముకేశ్ కుమార్,ప్రసిద్ధ కృష్ణ, జస్రీత్ బుమ్రా, కేఎస్ భరత్,అవేశ్ ఖాన్. అభిమన్యు ఈశ్వరన్.