కరోనా నుంచి ఇండియాకు బిగ్ రిలీఫ్ లభించింది. గత కొన్ని రోజులుగా రోజూవారీ కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదు కావడం దేశ ప్రజలకు ఊరటనిచ్చే విషయం. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో దేశాన్ని పట్టిపీడించిన కరోనా థర్డ్ వేవ్ దాదాపుగా అంతమైంది. ఒకానొక సమయంలో కేసుల సంఖ్య మూడు లక్షలను కూడా దాటింది. మరణాల రేటు కూడా పెరిగింది. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య, మరణాలు గణనీయంగా తగ్గాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6915 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. 180 మంది మరణించారు. 16864 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో 92472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు కోవిడ్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,23,24,550 గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 5,14,023 గా ఉంది. ఇప్పటి వరకు ఇండియాలో 177,70,25,914 వ్యాక్సిన్ డోసులను అందించారు.