కరోనా ఖతం అయిపోయింది. మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గి పోతున్నాయి. ఇప్పటికే భారీగా తగ్గి పోయాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 4194 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,84,261 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 42,219 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98. 99 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 255 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,15,714 కి చేరింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,79,72,00,515 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 16,73,515 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6208 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,26,328 కు చేరింది.