కరోనా నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం… అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగింపు

-

దేశంలో పాటు ప్రపంచ దేశాల్లో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని 2022 ఫిబ్రవరి 28 వరకు పొడగించింది. దేశంలో పాటు ముక్యంగా యూరోపియన్ దేశాలు, అమెరికాతో పాటు అన్ని దేశాల్లో ఇటీవల కాలంలో ఓమిక్రాన్ కేసులు పెరిగాయి. దీంతో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడగించినట్లు తెలుస్తోంది. గతంలో జనవరి 31 వరకు ఇండర్నేషనల్ సర్వీసులపై నిషేధం ఉంది. అయితే దీన్ని ఫిబ్రవరి 28 వరకు పొడగిస్తూ .. ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. కార్గో సర్వీసులతో పాటు, ఎయిర్ బబుల్ ఉన్న విమాన సర్వీసులకు ఇబ్బందులు లేవు. 2020 జులై నుంచి ఎంపిక చేసిన కొన్ని దేశాల మధ్య విమాన సర్వీసులను నడుపుతోంది. దీంతో పాటు వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న ప్లైట్లకు ఏం ఇబ్బందుల ఉండవు. వీటిని డీజీసీఏ అనుమతిస్తోంది. కాగా కరోనా కారణంగా 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ ప్రయాణికలు విమానాలను భారత్ నిలిపివేసింది. గతేడాది డిసెంబర్ లో అంతర్జాతీయ విమానాలను పునరుద్దరించాలని అనుకుంటున్న క్రమంలో ఓమిక్రాన్ విస్తరించడంతో ఈ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news