పెళ్లి కానున్నా పర్వాలేదు.. పిల్లలను కనొచ్చు’ పాలకుల సంచలన నిర్ణయం

-

పెళ్లి కాకుండా పిల్లలను కనడం పెద్ద పాపం, అపచారం.. అసలు ఆ మాట చెప్పడానికే కాదు వినడానికి కూడా చాలమంది ఇష్టపడరు.. కానీ కొంతమంది తప్పనిసరిపరిస్థితుల్లో సమాజం తప్పు అనుకోనే పని చేసి.. దాన్ని బట్టి స్టెప్‌ తీసుకుంటారు. కొందరు అబాషన్లు చేసుకుంటే.. మరికొందరు అప్పుడు పెళ్లి చేసుకుంటారు.. కొన్ని దేశాల్లో పెళ్లికాకుండే పిల్లలను కనడం అమోదయోగ్యం కాదు.. చైనా కూడా నిన్నటి వరకూ ఇదే లిస్ట్‌లో ఉండేది..
చైనాలో పెళ్లికాకుండా పిల్లలను కంటే.. వారికి బర్త్‌ సర్టిఫికెట్లు కూడా ఇవ్వరు.. ఆ జంట పెళ్లి చేసుకుంటేనే.. వారిని పౌరులుగా భావిస్తారు.. అప్పుడే సర్టిఫికెట్లు మంజూరు చేస్తారు..కానీ చైనాలో ఇప్పుడు పెళ్లి కాకుండా పిల్లలను కనమని అక్కడి పాలకులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికాకుండా పిల్లలను కనేవారిపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేశారు.. ఇకపై పెళ్లికాని జంటలు తమ పిల్లల వివరాలను ప్రభుత్వ పథకాలు, సర్టిఫికెట్ల కోసం నమోదు చేసుకోవచ్చని ప్రకటించింది. చైనాలో సంతానోత్పత్తి రేటు పడిపోవడం వల్ల అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారట.. అందుకే పిల్లల పుట్టుకను నమోదు చేసుకోవడానికి జంటలు వివాహం చేసుకోవాలనే చట్టాన్ని తొలగించినట్లు తెలుస్తోంది..
సిచువాన్ ప్రావిన్స్‌లోని హెల్త్ కమిషన్ ఫిబ్రవరి 15 నుంచి పిల్లల జనన నమోదు ప్రక్రియను సులభతరం చేస్తున్నట్లు వెల్లడించింది. పెళ్లి కాకుండా పిల్లలకు జన్మనిచ్చిన జంటలు ఇకపై వారి జననాలను నమోదు చేయాలని పేర్కొంది. చైనా చరిత్రలో గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో చైనాలో జనాభా పడిపోయింది. 2022లో చైనాలో 9.56 మిలియన్ల మంది జన్మించారని, మరణాల సంఖ్య 10.41 మిలియన్ల కంటే ఎక్కువగా ఉందని ఆ దేశ ప్రభుత్వం జనవరి 17న ప్రకటించింది.. గత ఆరేళ్ల నుంచి చైనాలో జనన శాతం తగ్గపోతుంది. ఈ రిపోర్టులు వచ్చిన వారం వ్యవధిలోనే సిచువాన్ ప్రావిన్స్‌ పాలకులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఒక జంట కేవలం ఒక బిడ్డను మాత్రమే కనాలనే రూల్‌ను కూడా ఎత్తేసింది. 2021 నుంచి ప్రతి జంట కనీసం ఇద్దరు పిల్లలను కనాలనే పాలసీని ప్రకటించింది. అయితే, చైనా ప్రజలు మాత్రం ఒక బిడ్డతో సరిపెట్టుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఇద్దరు పిల్లలను పోషించడం కష్టమని.. ఒక్కరుచాలని అభిప్రాయ పడుతున్నారు..
సిచువాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. స్థానిక పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం వివాహేతర సంబంధాలను ప్రోత్సహించేలా ఉందని, పెళ్లి అవసరం లేకుండా పిల్లలను కనమని చెప్పేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సింగిల్ ఫాదర్ లేదా సింగిల్ మదర్స్‌కు సాయం చేసే పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిబంధన సిచువాన్ ప్రాంతానికే పరిమితం. చైనాలోని మిగతా ప్రాంతాల్లో పాత విధానాలే అమల్లో ఉన్నాయి. అక్కడి మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తీసుకోవాలంటే తప్పకుండా మ్యారేజ్ సర్టిఫికెట్‌ను చూపించాల్సిందే. పెళ్లికాకుండా గర్భం దాల్చే మహిళలకు ఆ సదుపాయం లేదు.. సిచువాన్‌ ఐడియా చైనా మొత్తం పాకిదంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version