‘రెండు’ కూడా రాకపోతే కష్టమే రేవంత్!

-

తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్యే ప్రధానంగా రాజకీయ యుద్ధం నడుస్తోంది…ఈ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడింది…అసలు చెప్పాలంటే టీఆర్ఎస్-బీజేపీలు వెనక్కి తోశాయి. అలాంటప్పుడు ఎలాగైనా ముందుకు రావడానికి కాంగ్రెస్ నేతలు కష్టపడాలి. కానీ కాంగ్రెస్ నేతలు ఆ దిశగా పనిచేయడం లేదు..ఎంతసేపు రేవంత్ రెడ్డిని వెనక్కి తోయాలనే పనిలో ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డికి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కంటే…తాను వెనక్కి పడిపోకుండా చూసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.

ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి మరీ దిగజారిపోతుంది. అయితే ఈ పరిస్తితి ఉండకూడదు అంటే..మునుగోడులో కాంగ్రెస్ గెలవాల్సిన పరిస్తితి. ఇప్పటివరకు ఏ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవలేదు. ఈ ఉపఎన్నికలో మాత్రం గెలవకపోతే అంతే సంగతులు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఆయన నాయకత్వంపై అనుమానాలు వస్తాయి.

కాబట్టి ఈ ఉపఎన్నిక రేవంత్ రెడ్డికి చావో రేవో లాంటిది..ఓ వైపు సీనియర్లు పగ పట్టేశారు…ఎలాగైనా రేవంత్ రెడ్డిని పి‌సి‌సి పదవి నుంచి తప్పించాలని చూస్తున్నారు…అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూ…రేవంత్ టార్గెట్ గానే రాజకీయం చేస్తున్నారు. సీనియర్లు పూర్తిగా మునుగోడు విషయం వదిలేసినట్లు కనిపిస్తున్నారు. పైగా ఏదొక విషయంలో అడ్డుపెడుతూనే ఉన్నారు.

ఆఖరికి మునుగోడు అభ్యర్ధి ఎంపిక విషయంలో కూడా నేతలు ఒక తాటిపైకి రావడం లేదు. అసలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ముందుకెళ్లాలనే ఆలోచన మాత్రమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక అటు మునుగోడులో కొద్దో గొప్పో బలం ఉన్న నేతలు…బీజేపీ లేదా టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో మునుగోడులో కాంగ్రెస్ ని గెలిపించడం రేవంత్ రెడ్డికి చాలా కష్టమైన పని.

అయితే రేవంత్ క్రెడిబిలిటీ దెబ్బ తినకుండా ఉండాలంటే…కనీసం మునుగోడులో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్‌లోనైనా నిలవాలి. అలా కాకుండా మూడో స్థానానికి పడిపోతే ఇంకా రేవంత్ పని అధోగతే.

Read more RELATED
Recommended to you

Latest news