టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. అక్కడి నుంచి కూడా విజయవాడకు బస్సులు

-

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని #TSRTC నిర్ణయించింది. మియాపూర్ నుంచి వెళ్లే బస్సులను జేబీఎస్ మీదుగా నడపాలని కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్‌ఆర్టీసీ. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ట్వీట్ చేశారు. విజయవాడకు వెళ్లే బస్సుల్లో ఎక్కువగా ఎంజీబీఎస్‌లో ప్రారంభమవుతాయి.

అల్వాల్, శామీర్‌పేట తదితర ప్రాంతాల నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులు ఎంజీబీఎస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా ఇక మీదట జేబీఎస్ మీదుగా నడపనుంది. మియాపూర్ నుంచి కేపీహెచ్‌బీ కాలనీ, బాలానగర్, బోయినపల్లి, జేబీఎస్, సంగీత్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు నడుస్తాయి. అక్టోబర్ 18, బుధవారం నుంచి ఈ సర్వీసులు జేబీఎస్ మీదుగా ప్రయాణిస్తాయి. బస్సు చార్జీల్లో పెద్దగా మార్పు లేదు.

 

ఇదిలా  ఉంటే.. దసరా పండుగకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి రూ.11 లక్షల నగదు బహుమతులు గెలుపొందే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది టీఎస్ఆర్టీసీ. దసరాకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారు టికెట్ వెనకాల మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్ ని రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో వాటిని వేయాలి. రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు లక్కీడ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version