రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది : జేపీ నడ్డా

-

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఏపీ బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపి సర్కారు అత్యంత అవినీతిలో కూరుకు పోయిందన్నారు. మైనింగ్, ఇసుక, లిక్కర్, ల్యాండ్, ఎడ్యుకేషన్ స్కాం లతో ఈ ప్రభుత్వం మునిగిపోయిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. ‘ఏ స్కామ్ లు ఉన్నాయి అన్నిటి చేస్తోంది. ఇది సిగ్గు చేటు….ఏ ప్రభుత్వం చేయాని విధంగా వైసిపి అవినీతిలో కూరుకుపోయింది…ప్రధాని వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికీ అక్కడ ఏమీ జరగలేదు…రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేశారు… రాజధాని లేని రాష్ట్రం గా ఏపి మారింది….
రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడింది. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు… రాయలసీమ అభివృద్ధిని వైసిపి సర్కారు గాలికి వదిలేసింది…

BJP president JP Nadda slams the Opposition for using divisive tactics with  a communal agenda to harm the nation

బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వండి…. దేశంలో మోడీ ఓటు బ్యాంక్ రాజకీయాలను మార్చారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను జవాబుదారీ రాజకీయాలుగా, ఫలితాలు చూపే పారదర్శక రాజకీయాలు గా మార్చిన ఘనత మోడీ దే. 9 ఏళ్లుగా ఈ దేశానికి మోడీ సుపరిపాలన అందించారు. బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పాటుపడిన పేదల ప్రభుత్వం ఇది… కరోనా సమయంలో దేశంలోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను ఉచిత0గా పంపిణీ చేశాము… మోడీ వచ్చాక మన దేశ0 లో పేదరికం రేటు తగ్గింది… స్వాతంత్య్రం వచ్చాక జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే మోడీ వచ్చాక ఈ 9 ఏళ్ల లోనే ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ది జరిగింది… ప్రపంచంలోనే మన దేశ0 వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్నది…’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news