నెల్లూరు కందుకూరు తొక్కిసలాట ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ సంఘటనకు కారణమైన చంద్రబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నడిరోడ్డుపై సభ ఎలా పెడతారని నిలదీశారు.
గ్రౌండ్లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డుకు మీదకు రావటం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు..ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి..వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. మృతుల పిల్లలకు ఛారిటీ ద్వారా విధ్యనందిస్తామని తెలిపారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.