లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విక్రమ్’ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తు్న్నాడు. తన అభిమాని లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ పిక్చర్..త్వరలో సరి కొత్త రికార్డులను క్రియేట్ చేయబోతున్నది.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది. చాలా కాలం తర్వాత వెండితెరపైన కమల్ హాసన్ ను చూసిన అభిమానులు ఆనందంగా ఫీలవుతున్నారు. లోకేశ్ కనకరాజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కమల్ హాసన్ సైతం సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే విశ్వనటుడు కమల్ హాసన్ తన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కు ఊహించని సర్ ప్రైజెస్ ఇస్తున్నాడు. ఇటీవల తన స్వదస్తూరి తో రాసిన లేఖను పంపారు. తాజాగా దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ను తన వద్దకు పిలిపించుకుని లెక్సస్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చక్కటి సినిమాను అందించింనందుకు బహుమానంగా కమల్ ఈ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. కమల్ హాసన్ కారు తాళాలను లోకేశ్ కనకరాజ్ కు అందించారు. తన అభిమాన హీరో, తను ఇండస్ట్రీలోకి రావడానికి కారణమైన కమల్ చేతుల మీదుగా బహుమంతి పొందడం సంతోషంగా ఉందని డైరెక్టర్ లోకేశ్ తెలిపారు.
.@ikamalhaasan gifts a Lexus car to his blockbuster director @Dir_Lokesh . Well deserved 👏👏👏👏 #Vikram pic.twitter.com/otw06MJcz9
— Rajasekar (@sekartweets) June 7, 2022