మహిళా సాధికారతకు బాటలేసిన ‘అభినవ అంబేడ్కర్’ CM జగన్ అని మంత్రి ఉషశ్రీ కొనియాడారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రూ. 14,205కోట్ల రుణాన్ని మాఫీ చేయకుండా మహిళలను మోసం చేశారని ఆరోపించారు. బాబు హయాంలో A, B గ్రేడులుగా ఉన్న సంఘాలను నిర్వీర్యం చేశారని.. ఇప్పుడవి C గ్రేడుకు పడిపోయాయన్నారు. సున్నా వడ్డీ పథకానికి కూడా చంద్రబాబే ఫుల్స్టాప్ పెట్టారని విమర్శించారు.
డ్వాక్రా మహిళలను చంద్రబాబు నిలువునా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే సమయంలో 80 వేల సంఘాలే ఉండేవని, సీఎం జగన్ వచ్చాక 2 లక్షలకు పైగా సంఘాలు వచ్చాయని వివరించారు. డ్వాక్రా మహిళల కష్టాలు చూశాక సీఎం జగన్ నాలుగు దఫాలుగా నగదు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని సంఘాలు ప్రగతిబాటలో నడుస్తున్నాయని చెప్పారు. డ్వాక్రా మహిళలను ఎవరూ బెదిరించడం లేదని, ఏ పథకం తీసుకున్నా మహిళలకే 50 శాతం వెళ్తున్నాయని వివరించారు. అందుకే తమ సభలకు మహిళలే ఎక్కువగా వస్తున్నారని చెప్పారు. అమెజాన్‌లో డిసెంబర్ 14 వరకు స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ 2022
మహిళలకు రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఉందని, మంచి అవకాశాలు వస్తున్నాయని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. మహిళల ఖాతాల్లో పథకాల డబ్బులు నేరుగా పడుతున్నాయని, అందుకే సీఎం జగన్‌ను చూడటానికి మహిళలు సభలకు ఎక్కువగా వస్తున్నారని చెప్పారు. అయితే, సభలకు వచ్చే మహిళలపై అనవసరమైన రాతలు రాసి, దుష్ప్రచారం చేయటం కరెక్ట్ కాదని హితవు పలికారు. మహిళలపై చంద్రబాబు హయాంలో ఎన్ని దాడులు జరిగాయో అందరూ చూశామని.. రిషితేశ్వరి, వనజాక్షి లాంటి వారిపై ఆకృత్యాలు టీడీపీ హయాంలోనే ఎన్నో వెలుగు చూశాయని అన్నారు.