అర్చకులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. పీఆర్సీ పై కీలక ప్రకటన

-

దేవాదాయశాఖ కమిషనర్ పరిధిలోని.. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు అలాగే ఇతర సిబ్బందికి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. దేవాదాయ శాఖ కమిషనర్ పరిధిలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఇతర సిబ్బందికి వేతన సవరణ ( p. r.  c ) వర్తింప జేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

KCR-TRS

ఈ పి ఆర్ సి అమలు కారణంగా ఏకంగా రెండు వేల పదహారు వందల 41 మంది దేవాదాయ సిబ్బందికి.. లబ్ధి చేకూరనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ పీఆర్సీని జూన్ మాసం నుంచి అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో రోజుల నుంచి అర్చకుల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో నే ఈ ప్రకటన చేసినట్లు స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక జీవోను విడుదల చేసింది కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీని పై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version