2025 లో యశ్ “కెజిఎఫ్ – 3” రిలీజ్ ?

-

ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత ప్రజాదరణ పొందిన కొన్ని దక్షిణాది చిత్రాలలో “కెజిఎఫ్ చాఫ్టర్లు 1 అండ్ 2″లు కూడా ఉన్నాయి. ప్రజలకు ఎంతో ఆసక్తికరంగా ఉండే ఒక కాన్సెప్ట్ ను తీసుకుని దాని చుట్టూ ఉత్కంఠ భరితంగా కథను అల్లి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో కన్నడ హీరో యశ్ హీరోగా నటించి సినిమాను అమాంతం పైకి లేపేశాడు.. గతంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు అద్భుతమైన విజయాన్ని అందుకుని నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించాయి. రెండు పార్ట్ ల తర్వాత నిర్మాతలు ఇప్పుడు మూడవ పార్ట్ ను కూడా తీయాలని ఆసక్తిగా ఉన్నారు. పైగా చాప్టర్ 2 క్లైమాక్స్ లో ఇంకా ఏదో ఉందన్న ఫీలింగ్ కలగడంతో, మరో మంచి సబ్జెక్టు కు కనెక్ట్ చేసి సినిమా తీయాలని ఆలోచనలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇంకా సినిమా యూనిట్ నుండి అధికారిక సమాచారం అయితే రాలేదు.

సినిమా వర్గాల నుండి తెలుస్తున్న ప్రకారం వచ్చే సంవత్సరంలో షూటింగ్ ను మొదలు పెట్టి 2025 లో రిలీజ్ చేయడానికి చూస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version