కిడ్నీ ఆరోగ్యం కోసం ఇలా చేస్తే సరి..!

-

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా.. సమస్యలేవీ రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం మనం ఇప్పుడే తెలుసుకుందాం.
కిడ్నీ ఆరోగ్యం కోసం ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు.

హైడ్రేట్ గా ఉండండి:

ప్రతిరోజు సరిపడా నీళ్ళు తీసుకోవడం చాలా ముఖ్యం. సరిపడా ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలు వ్యర్థ పదార్థాలను బయటకు పంపింస్తాయి. కాబట్టి హైడ్రేట్ గా ఉండడం.. ఎక్కువ నీళ్ళు తీసుకోవడం ముఖ్యం.

ఉప్పు తగ్గించండి:

ఉప్పును తగ్గించడం వల్ల ముప్పు నుండి మీరు బయటపడొచ్చు. ఎక్కువ సాల్ట్ వల్ల కిడ్నీ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. కాబట్టి వీలైనంత తక్కువ సాల్ట్ ను తీసుకోండి.

కాల్షియమ్ ఆక్సలేట్ కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఉంటే ఇలా చెయ్యండి:

ఈ ఆహార పదార్థాలను తీసుకోండి:

మీరు తీసుకొనే డైట్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే డైట్ లో ఎక్కువగా వీటిని తీసుకుంటే మేలు కలుగుతుంది.

క్యాల్షియం:

కాల్షియం ఉండే ఆహార పదార్థాలను మీరు డైట్ లో తీసుకోవడం చాలా ముఖ్యం దీని వల్ల కిడ్నీ సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. కనుక వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం రోజుకీ తీసుకోండి.

నిమ్మరసం తీసుకోండి:

యూరిన్ క్రియాటీన్ లెవెల్స్ తక్కువగా వున్నా, పీహెచ్ లెవెల్స్ తక్కువగా ఉన్నా మీరు నిమ్మరసం తీసుకుంటే మంచిది. పంచదార వేయకుండా నిమ్మరసంలో నీళ్లు వేసుకొని తాగండి.

ప్రోటీన్ తీసుకోవడం:

ప్రోటీన్స్ ఆహారంలో తీసుకోవడం మంచిది అలా అని అతిగా తీసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news