పసుపు దివ్యఔషధం అని అంటారు.. దీన్ని వాడటం వల్ల..ఆరోగ్యానికి మంచిదని..ఇమ్యునిటిపవర్ పెరుగుతుందని చిన్నప్పుడు నుంచి వింటున్న విషయమే.. దీని వల్ల వచ్చే లాభాలు చాలా ఉన్నాయి.. చెప్పుకుంటే పోతే లిస్ట్ చాన్తాడంత ఉంది. డైజెషన్ సమస్యకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఓ సంచలన విషయం చెప్పారు. పసుపును వాడటం వల్ల కాలేయ సమస్యలు వస్తాయని గుర్తించారు. 2011-2022 మధ్యకాలంలో పసుపు వినియోగించే వారిలో కాలేయ సమస్యలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధరించారు. కర్కుమిన్ అనేది పసుపులో ఉండే వర్ణద్రవ్యం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కర్కుమిన్ పసుపుకు ప్రకాశవంతమైన పసుపు వర్ణద్రవ్యం ఇస్తుంది.
ఒక అధ్యయనం ప్రకారం.. ఆహారానికి రంగు, రుచిని అందించే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు ఉన్నాయి. ఇవి కాలేయంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయతని తేలింది.. కాలేయం అతిపెద్ద శరీర అవయవం. ఇది కొవ్వులను జీవక్రియ చేయడంతో పాటు నిల్వ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. పసుపు తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుందని గుర్తించారు.
పరిశోధన ఎలా జరిగిదంటే..
నాలుగు, ఎనిమిది వారాల విడతలుగా ఈ పరిశోధన నిర్వహించారు. వారికి ఇచ్చే ఆహారంలో పసుపును యాడ్ చేశారు. అలా తీసుకునే వారిలో కాలేయ సమస్యలు ఉత్పన్నమయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధనలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు నల్ల మిరియాలతో కలిపి పసుపును తీసుకున్నారు. ఇది జీర్ణక్రియకు సహకరించింది. కానీ కేవలం పసుపును తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురయ్యాయట.
అతిగా పసుపు వాడటం వల్ల నష్టాలు..
పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు, ఉబ్బరం, తలతిరగడం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
అంతే కాకుండా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది.
కర్కుమిన్ కొవ్వు కణాలు పెరగకుండా చేస్తుంది.
పిత్తాశయ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు పసుపును వీలైనంత తక్కువగా తినాలి.
ఐరన్ లోపం ఉన్నవారు పసుపు తీసుకోపోవడమే మంచిది.