మ‌హానాడు ఆన్‌లైన్‌లోనే.. చ‌రిత్ర‌లో ఇలా జ‌ర‌ప‌డం తొలిసారి

-

టీడీపీ ఇప్పుడు దాదాపు యాక్టివ్ పాలిటిక్స్‌కు చాలా దూరంగా ఉంటోంది. ఈ క‌రోనా కార‌ణంగా ఏదైనా ఆన్‌లైన్ మీటింగుల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతోంది. ఇప్పుడు ఆ పార్టీకి మ‌రో స‌మ‌స్య వ‌చ్చింది. టీడీపీ స్థాప‌కుడైన ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 28న వ‌స్తోంది. ప్ర‌తి పుట్టిన రోజుకు మ‌హానాడును పండుగ‌లా చేస్తూ వ‌స్తోంది టీడీపీ.

ఈ ఏడాది కూడా ఎలా జ‌ర‌పాల‌నేదానిపై టీడీపీ అదినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం రీసెంట్‌గా జ‌రిగింది. మే 27, 28 తేదీల్లో డిజిటల్ వేదికగా మహానాడును జ‌ర‌పాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. ఇందుకోసం మౌఖిక ఆదేశాలు జారీచేసింది.

ప్ర‌తిసారి అన్ని జిల్లాల్లో మ‌హానాడును పండుగలా చేసి ఉనికి చాటుకుంటోంది టీడీపీ.కానీ ఈ సారి మాత్రం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేయ‌డం కొంత న‌ష్ట‌మే అని చెప్పాలి. ఇది కేడ‌ర్ బ‌లాన్ని దెబ్బ‌తీస్తుంద‌ని పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది. కానీ ఇలాంటి టైమ్‌లో రిస్క్ తీసుకోకుండా ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హించాల‌ని చూస్తోంది. మొత్తానికి మొద‌టిసారి మ‌హానాడును ఇలా చేయ‌డం ఆ పార్టీకి చ‌రిత్ర‌లో తొలిసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version