టాలీవుడ్ అలనాటి అగ్ర హీరో సూపర్ స్టార్ కృష్ణ నేడు 80 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తనయుడు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు తండ్రికి బర్త్డే విషెస్ చెప్పారు.” పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న..! మీలాంటివారు నిజంగా ఎవరు లేరు. రాబోయే చాలా రోజుల్లో మీరు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.లవ్ యూ..” అని ట్వీట్ చేశారు.
అలాగే కృష్ణ కోడలు, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇంస్టాగ్రామ్ లో మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.” మీతో గత కొన్నేళ్లుగా మాకు చాలా ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలో చాలా ప్రేమ, నవ్వు, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. మీరు నా భర్తకు, నాకు మా అందరికీ తండ్రి అయినందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్య. మేము నిన్ను ప్రేమిస్తున్నాం.” అని నమ్రత పోస్ట్ చేశారు.
Happy birthday Nanna! There is truly no one like you. Wishing for your happiness & good health for many more years to come. Stay blessed always. Love you ♥️🤗🤗 pic.twitter.com/rJKvVQoHQq
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2022