Breaking : తెలంగాణ గ్రేహౌండ్స్‌ ఆపరేషన్‌లో హిడ్మా మృతి

-

కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో హిడ్మా ఎన్‌కౌంటర్ అయ్యాడు. తెలంగాణ- బీజాపూర్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్, సీఆర్‌ఫీఎఫ్‌ కోబ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్‌లో హిడ్మా మృతి చెందాడు. ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక వ్యూహకర్తగా హిడ్మా వ్యవహరించాడు. 1996-97లలో 17 ఏళ్ల వయసులో అతడు ఉద్యమం పట్ల ఆకర్షితుడై మావోయిస్టుల్లో చేరాడు. చత్తీస్‌గడ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి హిడ్మా స్వగ్రామం.

ఇతనికి సంతోష్, హిద్మల్లు వంటి మారు పేర్లు ఉన్నాయి. ఉద్యమంలోకి రాక ముందు హిడ్మా వ్యవసాయం చేసేవాడు. 7వ తరగతి వరకే చదువుకున్న హిడ్మా.. మావోయిస్టు పార్టీతో పని చేసిన ఓ లెక్చరర్ ద్వార ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఆయుధాల తయారీ, రిపైర్ వర్క్‌లో నిపుణుడిగా మారాడు. 2001-02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్‌లో హిడ్మా ఎదిగాడు. సల్వాజుడుం ఎదుగదల హిడ్మా మరింత యాక్టివ్‌ కావడానికి కారణమైంది. 2007లో ఉర్పల్ మెట్ట వద్ద సీఆర్పీఎఫ్‌పై జరిగిన దాడిలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు.

Read more RELATED
Recommended to you

Latest news