సీఎం రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: బూర నర్సయ్య గౌడ్

-

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని పలుచోట్ల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ కూలిపోతుందోనని కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ సీట్లు సాధిస్తుందని.. మరోసారి నరేంద్ర మోడీ భారత ప్రధాని కాబోతున్నారని ఆశా భావం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే భువనగిరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని బూర నర్సయ్య గౌడ్ సవాల్ విసిరారు. కాగా, భువనగిరి లోక్ సభ స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి ,బీజేపీ తరుఫున మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు. ఇక, బీఆర్ఎస్ తరపున క్యామ మల్లేష్‌కు ఎంపీ టికెట్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version