MEGASTAR 154 : ర‌వితేజకు జోడీ గా నివేదా పేతురాజ్!

-

మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా షూటింగ్ కోసం అంతా సిద్ధం అవుతుంది. ఈ సినిమా డైరెక్ట‌ర్ బాబీ సినిమా కావాల్సిన పాత్ర‌ల‌ను ఎంచుకునే ప‌నిల బిజీ గా ఉన్నాడు. కాగ ఈ సినిమా లో చిరంజీవి త‌మ్ముడి పాత్ర కోసం మాస్ మ‌హారాజా రవితేజ‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగ ఈ సినిమా లో ర‌వితేజ‌కు జోడీగా నివేదా పేతురాజ్ ను ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ విషయాని మైత్రీ మూవీ మేక‌ర్స్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. కాగ ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ న‌టిస్తుంది. కాగ నివేదా పేతురాజ్.. త‌మిళ‌నాడుకు చెందిన న‌టి.

కానీ నివేదా పేతురాజ్ కు తెలుగులోనే ఎక్కువ అవ‌కాశాలు, గుర్తింపు వ‌చ్చింది. నివేదా పేతురాజ్ తెలుగు లో మొద‌టి సారి మెంటల్ మ‌దిలో అనే సినిమాలో న‌టించింది. త‌ర్వాత టిక్ టిక్ టిక్ తోపాటు చిత్ర‌ల హ‌రి, బ్రోచేవారెవ‌రురా తో పాటు ఇటీవ‌ల అల్లు అర్జున్ హిట్ మూవీ అలా వైకుంఠ‌పుర‌ములో అనే సినిమాలో కూడా కీల‌క పాత్ర‌లో నటించింది. పాగ‌ల్, రెడ్ సినిమాల్లోను కీల‌క పాత్ర‌ల్లో న‌టించింది. ప్ర‌స్తుతం మెగాస్టార్ 154 సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని కొట్టేసింది.

కాగ మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి కావ‌డంతో మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలోని గాడ్ ఫాద‌ర్, మెహ‌ర్ రామేశ్ ద‌ర్శ‌క‌త్వంలోని భోళా శంక‌ర్ సినిమా షూటింగ్ ల‌లో బిజీ గా ఉన్నారు. అలాగే ర‌వితేజా.. రామారావు ఆన్ డ్యూటీ, ధ‌మాకా, టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు సినిమా షూటింగ్ ల‌లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version