అక్కడ పురుషుల హెయిర్‌ కట్‌కు రూ. 4000 పైనే అవుతుందట..!

-

మనిషిని లుక్‌నే మార్చేస్తుంది హెయిర్‌ స్టైల్‌.. అది అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా సరే. అందుకే అందరూ జుట్టు మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. అయితే ఎంత స్టైలిష్‌ హెయిర్‌ స్టైల్‌ అయినా మన సైడ్‌ 500 లోపే ఉంటుంది. అబ్బాయిలకైతే ఎలాంటి స్టైల్‌ కొట్టించినా 150-200 తీసుకుంటారు. కానీ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పురుషుల హెయిర్ కట్ ధరలు ఎలా ఉన్నాయి? ఏ దేశంలో ఎక్కువ ధర ఉంది? ఎక్కువ ధరలు ఉన్న టాప్ 10 దేశాలేవే మీకు తెలుసా..? ఇక్కడ వందల్లో కాదు వేలల్లోనే ఉంటుంది.!

పురుషుల హెయిర్ కట్‌కి యూరప్ దేశమైన నార్వేలో ప్రపంచంలోనే అత్యధిక ధర ఉంది. అక్కడ ఒకసారి హెయిర్‌ కట్ చేయించుకుంటే రూ.5,336 ఇచ్చుకోవాలి.

జపాన్‌లో ఒకసారి జుట్టు కట్ చేయించుకుంటే రూ.4,626 చెల్లించాలి.

యూరప్ దేశం డెన్మార్క్‌లో హెయిర్‌ కట్‌కి రూ.3,982 తీసుకుంటున్నారు.

స్వీడన్‌లో ఇది రూ.3,811గా ఉంది.

5వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలో రూ.3,800 తీసుకుంటున్నారు.

అమెరికాలో సెలూన్‌కి వెళ్తే రూ.3,635 అవుతుందట.

స్విట్జర్లాండ్‌లో రూ.3,549 ఇవ్వాల్సిందే.

ఇక ఫ్రాన్స్‌లో కటింగ్‌కి రూ.3,060 అవుతుందట.

సౌత్‌ కొరియాలో రూ.3,051 చెల్లించాలి.

10వ దేశంగా ఉన్న ఇంగ్లాండ్‌లో హెయిర్‌కట్‌కి రూ.2,952 అవుతోంది.

ఇండియాలో ఎంతంటే..

ఈ లిస్ట్‌లో ఇండియా 35వ స్థానంలో ఉంది. ఇండియాలో హెయిర్ కట్‌కి సగటున రూ.437 తీసుకుంటున్నారు. ఒక్క హెయిర్‌ కట్‌కే ఇంత గానం అవుతుందంటే.. తినడానికి, ఉండటానికి ఇంకెంత అవుతుందో.!

Read more RELATED
Recommended to you

Exit mobile version