మోసాలకు పాల్పడేందుకు టెక్నాలజీని విపరీతంగా వాడుకుంటున్నారు. ముందు న్యూడ్ కాల్స్ అంటూ వలపు వల వేస్తున్నారు. ఆ తరువాత రికార్డ్ చేసిన వీడియోలను అడ్డుపెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటన రోజూ చూస్తునే.. మళ్లీ.. మళ్లీ.. అలాంటి రొంపిలోకే దిగుతున్నారు. మొదట మాయమాటలు చెప్పి లొబరుచుకుంటారు. ఆ తర్వాత మాట వినక పోతే ఏకాంతంగా ఉన్న వీడియోలను చూపించి బెదిరింపులకు దిగుతున్నారు.దాంతో చనిపోయె వారి సంఖ్య కూడా పెరిగింది. తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది.ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మాములుగా చనిపొయాడని అందరు అనుకున్నారు.కానీ అతని పోస్ట్ మార్టమ్ సమయం లో అతని దగ్గర ఒక సూసైడ్ నోట్ దొరికింది. దాంతో హనీ ట్రాప్ బయట పడింది.ఈ ఘటన బెంగుళూరు లో వెలుగు చూసింది. హేరోహళ్లి వార్డు బీజేపీ నాయకుడు అనంతరాజు ఈ నెల 12న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు.
అయితే డెత్‌నోట్ సోమవారం దొరకడం తో హనీ ట్రాప్ అని బయటపడింది. ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా ఆమె తమ ప్రైవేటు ఫోటోలు, వీడియోలతో బెదిరింపుల కు పాల్పడిందని, దీనివల్ల ఆత్మహత్య చేసుకొంటున్నట్లు అనంతరాజు అందులో రాశాడు.ఆమె వలలో చిక్కుకొని మోసం చేసానని భార్యను క్షమాపణలు చెప్పాడు. కేఆర్ పురకు చెందిన రేఖా అనే మహిళతో ఫేస్‌బుక్ ద్వారా అనంతరాజుకు పరిచయమైంది. తరువాత ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోల ను చూపి ఆమె అనంతరాజును బ్లాక్‌మెయిల్ చేయసాగింది. అప్పుడప్పుడు అడిగినంత డబ్బును ఆమెకు ఇచ్చాడు. రోజురోజుకూ ఆమె నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఇంట్లో చెప్పుకోలేక తీవ్రంగా మథనపడ్డాడు. దాంతో ఉరివెసుకొని చనిపొయాడని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.