క్రీడాకారులకు శుభవార్త.. పల్లెప్రగతిలో క్రీడా మైదానాలు ఏర్పాటు

-

నల్లగొండ జిల్లాలో పల్లె పట్టణ ప్రగతి సమీక్ష సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడా సమితిలకు ప్రభుత్వ గుర్తింపు.. పల్లెప్రగతిలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్రీన్ కవర్ దారుణంగా ఉందని, 33%ఉండాల్సిన గ్రీన్ కవర్ 3%నీకే పరిమితం అయిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హరితహారంలో అందరిని భాగస్వామ్యం చేయాలని, కాలువగట్లు, చెరువు శిఖాలు, వాగులు, వంకలలో హరితహారం కార్యక్రమం చేపట్టాలన్నారు.

సాగర్ మెయిన్ కాలువ నుండి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వరకు, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో త్వరలో ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతిపై శాసనసభ్యులు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పల్లెప్రగతిలో పాఠశాలలను విధిగా సందర్శించాలని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుపెడుతుందని ఆయన ఆరోపించారు. పట్టణాలతో పల్లెలు పోటీ పడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, ఆ సంకల్పం నెరవేరినందునే కేంద్రం నుండి గ్రామపంచాయతీలకు అవార్డులు అయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version