మోదీకి ఇదే చిట్టచివ‌రి బ‌డ్జెట్ : మంత్రి కేటీఆర్‌

-

మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ఒక్క అంశాన్ని కూడా కేంద్రం అమ‌లు చేయ‌లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. నేను చెప్పింది త‌ప్ప‌ని రుజువు చేస్తే నేను ఏ శిక్ష‌కైనా సిద్ధం అని కేటీఆర్ స‌వాల్ విసిరారు. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించింది. కొత్త‌గా ఏర్ప‌డ్డ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో ఎన్నో ర‌కాల హామీలు, వాగ్దానాలు కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఇచ్చిందన్నారు. తెలంగాణ‌కు సంబంధించినంత వ‌ర‌కు క‌చ్చిత‌మైన‌, స్ప‌ష్ట‌మైన వాగ్దానాలు చేసింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ, బ‌య్యారంలో ఉక్కు ఫ్యాక్ట‌రీ, కొత్త విద్యా సంస్థ‌లు ఇస్తామ‌ని, పారిశ్రామిక కారిడార్‌లు, రాయితీలు ఇస్తామ‌ని, ఇలా ఎన్నో ర‌కాల వాగ్దానాలు పార్ల‌మెంట్ సాక్షిగా చ‌ట్టంలో పొందుప‌రిచారు. సీట్ల సంఖ్య కూడా పెంచుతామ‌ని చెప్పారు.

 

కానీ ఒక్క హామీ కూడా నెర‌వేర‌లేద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్‌. ఫిబ్ర‌వ‌రి 1న కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతుంది. ఇది మోదీకి చివ‌రి బ‌డ్జెట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎందుకంటే నేనేం శాపం పెట్ట‌డం లేదు. ఈ ప్రభుత్వం మ‌ళ్లీ ఎన్నిక‌లకు వెళ్లేలోపు 2024లో ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జెట్ ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్. దీనికి లెక్కాప‌త్రం ఉండ‌దు. నిబ‌ద్ధ‌త కూడా ఉండ‌దు. వ‌చ్చేవారు కొత్త‌గా పెట్టుకోవ‌చ్చు. ఆ బ‌డ్జెట్‌ను స‌వ‌రించుకోవ‌చ్చు. ఇప్పుడు పెట్టే బ‌డ్జెట్‌కు మాత్ర‌మే విలువ ఉంటుంది. కేంద్రానికి నిబ‌ద్ధ‌త ఉంటే.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట నిలుపుకునేందుకు ఇది చివ‌రి అవ‌కాశం అని పేర్కొన్నారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news