మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అచ్చే దిన్ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు నేటితో 8 ఏళ్లు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితం వ్యంగ్యంగా విమర్శలు చేశారు. మోదీ అచ్చే దిన్‌కు 8 ఏళ్లు నిండాయన్న కేటీఆర్… ఈ 8 ఏళ్లలో మోదీ సర్కారు సాధించిందేమిటి అన్న వాటిని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ సంధించారు.
ఈ 8 ఏళ్లలో రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి చేరిందన్న కేటీఆర్…45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం దాపురించిందని పేర్కొన్నారు. ఇక 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరిందని, ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ ధరలు దేశంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. 42 ఏళ్లలో అత్యంత దారుణ స్థితికి ఆర్థిక వ్యవస్థ దిగజారిందని పేర్కొన్నారు కేటీఆర్.
Dear Modi Ji,
8 years ago on this very day, you had promised “Achhe Din”
What your Govt has delivered👇
❇️ Rupee at its Lowest ₹77.80
❇️ Highest unemployment in 45 yrs
❇️ Highest inflation in 30 yrs
❇️ Highest LPG price in the world
❇️ Worst economy in 42 yrsWell done Sir👏 https://t.co/m2Yx3zF4is
— KTR (@KTRTRS) May 16, 2022