మరింత సుందరంగా కంజర్ల లక్ష్మీనారాయణ పార్క్‌ : మంత్రి తలసాని

-

సనత్ నగర్ డివిజన్‌లోని కంజర్ల లక్ష్మీనారాయణ (KLN) పార్క్‌ను రూ. 3 కోట్ల వ్యయంతో మరింత ఆధునీకరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఆయన KLN పార్క్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి పార్క్ లో చేపట్టనున్న అభివృద్ధి పనుల పై రూపొందించిన నమూనాను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే నెల 11 వ తేదీన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోనే అతిపెద్ద పార్క్ అయిన KLN పార్క్ కు ప్రతినిత్యం వివిధ వయసులకు చెందిన వేలాది మంది వస్తుంటారని, వారిని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలను కల్పిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. పార్క్ లోని లేక్‌లో నిరంతరం నీరుండే విధంగా ఏర్పాట్లు చేస్తాం.

అందులో బోటింగ్ సౌకర్యం కల్పించే చర్యలు చేపడతామని వెల్లడించారు మంత్రి తలసాని. అంతేకాకుండా పిల్లల కోసం అత్యాధునిక క్రీడా సామగ్రిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. పార్క్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు మంత్రి తలసాని. మంత్రి వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిర, వాటర్ వర్క్స్ జీఎం హరి శంకర్, టీఆర్‌ఎస్‌ డివిజన్ అధ్యక్షులు కోలన్ బాల్ రెడ్డి, షాబాజ్ శ్రీనివాస్, సరాఫ్ సంతోష్, రాజేష్ ముదిరాజ్, పద్మ, పుష్పలత, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version